Malware: గిఫ్ట్‌ల పేరుతో టోకరా.. ప్రమాదంలో 70 దేశాల ఆండ్రాయిడ్‌ యూజర్లు

30 Sep, 2021 13:36 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా 70దేశాల్లో 10మిలియన్ల మంది ఆండ్రాయిడ్‌ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. సైబర్‌ నేరస్తులు 'గిఫ్ట్‌ హార్స్‌' అనే మాల్‌వేర్‌ సాయంతో సైబర్‌ నేరస్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్‌ సెక్యూరిటీ సంస్థ జింపేరియం రిపోర్ట్‌ను విడుదల చేసింది. 

ప్రపంచ వ్యాప్తంగా 70దేశాలకు చెందిన ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ అకౌంట్లలో నుంచి ఉన్న మనీని కాజేసేందుకు క్యాంపెయిన్‌ నిర్వహిస్తుందని జింపేరియం హెచ్చరికలు జారీ చేసింది.ఇదే విషయం తమ రీసెర్చ్‌లో వెలుగులోకి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.సైబర్‌ నేరస్తులు పక్కా ప్లాన్‌తో గూగుల్‌ ప్లే స్టోర్‌, థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా(ఫిష్షీ) లింక్స్‌ పంపి యూజర్ల ఈమెయిల్‌, బ్యాంక్‌ అకౌంట్లను తస్కరిస్తారు. 

డబ్బుల్ని ఎలా దొంగిలిస్తారు?
సైబర్‌ నేరస్తులు ముందుగా లోకల్‌ లాంగ్వేజ్‌లో యూజర్లను అట్రాక్ట్‌ చేసేలా యాడ్స్‌ను ఆండ్రాయిడ్‌ ఫోన్‌లకు సెండ్‌ చేస్తారు. ఆ యాడ్స్‌ లో ఉన్న లిక్‌ క్లిక్‌ చేస్తారో వారికి కళ్లు చెదిరే బహుమతులు అందిస్తామని ఊరిస్తారు. ఆ ఆఫర్లకు అట్రాక్ట్‌ అయిన యూజర్లు పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. మీరు సెలక్ట్‌ చేసుకున్న గిఫ్ట్‌ మీకు కావాలనుకుంటే ఫోన్‌నెంబర్‌తో పాటు మెయిల్‌ ఐడీ, వ్యక్తిగత వివరాల్ని నమోదు చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్‌ పంపిస్తారు. వ్యక్తిగత వివరాల్ని యాడ్ చేసే సమయంలో ఐపీ అడ్రస్‌ ద్వారా వాటిని దొంగిలించి డైరెక్ట్‌గా యూజర్‌ అకౌంట్లలో ఉన్న మనీని కాజేస్తారు.

అంతేకాదు తాము అందించే భారీ గిఫ్ట్‌లు కావాలనుకుంటే ప్రీమియం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇలా 70 దేశాల్లో ఒక్కో యూజర్‌ నుంచి ప్రతి నెలా రూ.3100లు వసూలు చేస్తారని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ జెడ్‌ల్యాబ్స్‌ తెలిపింది. 2021లో ఇదే అత్యంత ప్రమాదకరమైన సైబర్‌ దాడి' అని అభిప్రాయం వ్యక్తం చేసింది. 

చదవండి: ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడేవారిపై సైబర్‌ నేరస్తుల దాడులు..!

మరిన్ని వార్తలు