యూట్యూబ్‌లో మళ్లీ హైక్వాలిటీ వీడియోలు!

6 Nov, 2020 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ: మళ్లీ ఇప్పుడు ఇండియాలో హెచ్‌డీ క్వాలిటీలో వీడియోలు చూసే అవకాశాన్ని యూట్యూబ్‌ కల్పించనుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప మిగిలిన వారందరూ వర్క్‌ ఫ్రం హోం ద్వారా సేవలను అందించారు. అందువల్ల మొబైల్‌ నెట్‌వర్క్‌ల మీద అధిక భారం పడింది. దీనిని అదుపు చేయడానికి యూట్యూబ్‌ మార్చి నెలలో 1080 పిక్సల్‌ హెడీ వీడియోలను నిలిపివేసింది. బ్రాండ్‌ బాండ్‌ సేవలకు అంతరాయం కలగకుండా 480 పిక్సల్‌ క్వాలిటి వీడియోలకు మాత్రమే యూట్యూబ్‌ అనుమతినిచ్చింది. మొబైల్‌నెట్‌ వర్క్‌, బ్రాండ్‌బాండ్‌ నెట్‌వర్క్‌ల మీద కూడా ఈ నిషేధాన్ని విధించింది. అయితే ఇప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో దాదాపు కార్యాలయాలన్ని తిరిగి ప్రారంభమయ్యాయి.

ఇంటి నుంచి కాకుండా ఆఫీసుల నుంచి వర్క్‌ చేయడం ప్రారంభిస్తున్నారు. దీంతో భారతదేశంలో మళ్లీ హెచ్‌డీ 1080 పిక్సల్‌ హెడీ వీడియోలకు యూట్యూబ్‌ అనుమతినిచ్చింది. వైఫై నెట్‌వర్క్‌ ద్వారా వీడియోలను హై క్వాలిటీలో చూడొచ్చు. కొన్ని ఫోన్స్‌లో 1080 పిక్సల్‌ వీడియోలు ప్లే అవుతుండగా కొన్ని మొబైల్స్‌లో 1440 పిక్సల్‌ వీడియోలు ప్లే అవుతున్నాయి. అయితే రీసెంట్‌గా విడుదలై ఐవోఎస్‌తో నడిచే ఐఫోన్ XR, ఐఫోన్ 11 వంటి వాటిలో ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల ద్వారా 4కే వీడియోలను ప్లే చేయవచ్చు. అదేవిధంగా ఎయిర్‌టెల్‌, జియో నెట్‌వర్క్‌లలో ఐఫోన్ ఎక్స్‌ఆర్‌లో 4 కె వీడియోలను, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రోలో 1440 పి వీడియోలను ప్లే చేయవచ్చు. వీడియో క్వాలిటీ మీద ఉన్న నిషేధాలను ఎత్తివేయడంతో ఇక నుంచి హెచ్‌డీ వీడియోలను చూసి ఆనందించవచ్చు. 

చదవండి: రికార్డు బ్రేక్: ఈ పాట‌కు 7+ బిలియ‌న్ వ్యూస్‌

మరిన్ని వార్తలు