ఐడియా అదిరింది..10ఏళ్లకే కోట్లు సంపాదిస్తుంది,15ఏళ్లకు రిటైర్మెంట్‌!!

14 Jan, 2022 18:12 IST|Sakshi

స్కూల్‌కు వెళ్లే 10 ఏళ్ల పిల్లలు ఇంట్లో ఏం చేస్తుంటారు. అది కావాలి ఇది కావాలి' అంటూ మారం చేస్తుంటారు. పిల్లలు మారం చేస్తున్నారని వారి తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో పెట్టి బుజ్జగిస్తుంటారు. లేదంటే వారికి ఇష్టమైనవి కొనిచ్చి సంతోష పెడుతుంటారు. కానీ ఈ 10ఏళ్ల చిచ్చర పడిగు అలా కాదు. పెద్ద పెద్ద కంపెనీల సీఈఓల శాలరీలకు పోటీగా నెలకు కోట్లు సంపాదిస్తుంది. వాళ్లకి సవాలు విసురుతోంది.

వాట్ ఎన్ ఐడియా పిక్సీ కర్టిస్
ఆస్ట్రేలియాకు చెందిన 10ఏళ్ల పిక్సీ స్కూల్‌కు వెళుతుంది. ఓ రోజు వాళ్ల అమ్మ రాక్సీ జాసెంకోతో ఇలా 'మమ్మీ నేనూ బిజినెస్‌ చేస్తా..నాకు డబ్బులు కావాలి' అని అమాయకంగా అడిగింది. దీంతో తల్లి రాక్సీ.. కూతురు పిక్సీ కోరికను కాదనలేక.. అప్పటికే కూతురు పేరుతో ఉన్న 'పిక్సీస్ బౌస్' వ్యాపారాన్ని కూతురుకి అప్పగిచ్చింది. 

ఏం వ్యాపారం చేస్తుంది
తల్లి వ్యాపార వ్యవహారాల్ని తన చేతిలోకి తీసుకున్న 10ఏళ్ల పిక్సీ..'పిక్సీస్ ఫిడ్జెట్స్‌' బొమ్మల్ని అమ్ముతుంది. తోటి పిల్లలకు ఎలాంటి బొమ్మలు నప్పుతాయో, వాళ్లు ఎలాంటి గాడ్జెట్స్‌ను ఇష్టపడతారో తెలుసుకొని వాటిని అమ్మడం ప్రారంభించింది. అలా వ్యాపారం ప్రారంభించిన 48గంటల్లో బొమ్మలన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పుడు నెలకు కోట్లలో సంపాదిస్తుంది. ఈ సందర్భంగా పిక్సీ తల్లి రాక్సీ మాట్లాడుతూ 'నేను 100ఏళ్లు పనిచేస్తా.. కూతురు 15ఏళ్లకు రిటైర్‌ అయ్యేలా ప్లాన్‌ చేస్తున్నా' అంటూ సంతోషంగా చెబుతోంది.

చదవండి: ‘బచ్‌పన్‌ కా ప్యార్‌’ పిలగాడు: బతికి బట్ట కట్టాడు.. మళ్లీ అదృష్ట దేవత తలుపు తట్టింది

మరిన్ని వార్తలు