టాప్‌-500లో మన కంపెనీలు

13 Jan, 2021 08:41 IST|Sakshi

ముంబై: ప్రపంచంలో అత్యంత విలువైన 500 కంపెనీల జాబితాలో మన దేశానికి చెందిన 11 కంపెనీలకు చోటు దక్కింది. దేశాల పరంగా చూస్తే, ఈ జాబితాలో మన దేశం పదవ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయంగా చూస్తే యాపిల్‌ కంపెనీ 2.1 లక్షల కోట్ల డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉంది. 1.6 లక్షల కోట్ల డాలర్ల సంపదలతో మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్‌ 500 కంపెనీల జాబితాలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 54వ స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ విలువ 21 శాతం ఎగసి 16,880 కోట్ల డాలర్లకు పెరిగింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) విలువ 30 శాతం వృద్ధితో 13,900 కోట్ల డాలర్లకు పెరిగింది. దేశీయంగా రెండో స్థానంలో, అంతర్జాతీయంగా 73వ స్థానంలో ఈ కంపెనీ నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలువ 12% పెరిగి 10,750 కోట్ల డాలర్లకు చేరింది. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ విలువ 3 శాతం వృద్ధితో 6,820 కోట్ల డాలర్లకు, ఇన్ఫోసిస్‌ విలువ 57 శాతం పెరిగి 6,600 కోట్ల డాలర్లకు, హెచ్‌డీఎఫ్‌సీ విలువ 2 శాతం వృద్ధితో 5,640 కోట్లకు డాలర్లకు పెరిగాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు