ఎలన్‌ మస్క్‌ కంపెనీ బలుపు చేష్టలు..టెస్లాకు భారీ షాక్‌!

7 Oct, 2021 19:43 IST|Sakshi

ఎలన్‌ కంపెనీలో జాత్యంహకర వ్యాఖ్యలు..భారీ షాక్‌ ఇచ్చిన  కోర్టు..!

గత పది సంవత్సరాలుగా అమెరికాలో జాత్యంహాకర దాడులు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది 2020లో జార్జ్‌ ఫ్లాయిడ్‌ గొంతుపై మోకాలితో ఓ అమెరికన్‌ పోలీసు అధికారి దాడి చేసిన విషయం తెలిసిందే. జార్జ్‌ఫ్లాయిడ్‌ మరణం అమెరికాలో భారీ ప్రకంపనలనే సృష్టించింది. 

మస్క్‌ కంపెనీలో జాత్యాంహకార వ్యాఖ్యలు..!
అమెరికాలో బ్లాక్‌ లైవ్‌మ్యాటర్స్‌ పేరుతో భారీ ఉద్యమమే నడిచిన విషయం తెలిసిందే. జాత్యాంహకార వ్యాఖ్యలను చేయడంలో ఎలన్‌ మస్క్‌కు చెందిన టెస్లా  కంపెనీ కూడా తక్కువ తినలేదు. 2015లో టెస్లా కంపెనీలో పనిచేసిన ఓ నల్లజాతీయుడుపై  జాత్యాంహకార వ్యాఖ్యలు అప్పట్లో కలకలం సృష్టించాయి. ఈ విషయంపై యూఎస్‌ ఫెడర్‌ కోర్టు తన తీర్పును వెల్లడించింది. కాగా ఈ విషయంపై టెస్లా స్పందించలేదు.
చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్‌ డాలర్లు వారి సొంతం..!

అసలు ఏం జరిగిదంటే..!
నల్ల జాతీయుడైన ఓవెన్ డియాజ్ 2015 లో ఫ్రీమాంట్‌ ప్లాంట్‌లో పనిచేస్తోన్న సమయంలో మాజీ కాంట్రాక్ట్ ఎలివేటర్ ఆపరేటర్‌ వైట్‌ అమెరికన్‌ వేధించాడని, అంతేకాకుండా జాత్యంహకార వ్యాఖ్యలు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా  ఓవెన్‌ డియాజ్‌ కోర్డును ఆశ్రయించాడు. 

తీర్పును ప్రకటించిన కోర్టు...
 శాన్ ఫ్రాన్సిస్కో యూఎస్‌ ఫెడరల్‌ కోర్టులోని  జ్యూరీ బృందం అక్టోబర్‌ 4న తీర్పును వెలువరించింది. అతడిపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని కోర్టు తెలిపింది.  డియాజ్‌ మానసిక క్షోభకు గురైనందుకుగాను నష్టపరిహారంగాను 137 మిలియన్‌ డాలర్లను చెల్లించాలని కోర్టు టెస్లాను ఆదేశించింది. ఈ సందర్భంగా ఓవెన్‌ డియాజ్‌ మాట్లాడుతూ...అమెరికాలో నల్లజాతీయులపై జాత్యంహకార వ్యాఖ్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైనవి. నాకు నాలుగు సంవత్సరాల తరువాత న్యాయం దక్కింది. అమెరికాలో అత్యంత ధనిక సంస్థ టెస్లాలో జాత్యాంహకార వ్యాఖ్యలు రావడం కంపెనీకే సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 
చదవండి: స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ఎయిర్‌పాడ్స్‌ ఉచితం...!

మరిన్ని వార్తలు