విడుదల కానున్న ఐఫోన్‌14 సిరీస్‌, భారతీయులు ఏమంటున్నారంటే!

24 Aug, 2022 16:12 IST|Sakshi

టెక్‌ లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న యాపిల్‌ ఐఫోన్‌ -14 సిరీస్‌ సెప్టెంబర్‌ 7న లాంచ్‌ కానుంది. కొత్త ఐఫోన్‌ సిరీస్‌ విడుదలతో యూజర్లు తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సేవింగ్స్‌.కామ్‌ అనే సంస్థ ఐఫోన్‌ వినియోగదారులతో నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

మరికొద్ది రోజుల్లో ఎంతమంది ఐఫోన్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని అనుకుంటున్నారు. కాస్ట్‌ ఎక్కువగా ఉన్నా ఐఫోన్‌-14 విడుదల కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారంటూ ఇలా పలు ప్రశ్నలపై సర్వేలో పాల్గొన్న యూజర్లను సర్వే సంస్థ ప్రతినిధులు అడిగారు.  

► అందుకు 10శాతం మంది మాత్రమే ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఐఫోన్‌ అమ్మేసి కొత్త ఐఫోన్‌-14 సిరీస్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఆర్ధిక పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల కొత్త ఫోన్‌లను కొనుగోలు చేసే ఉద్దేశం తమకు లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరహా ధోరణి భారతీయల్లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది.      

ఉత్తర అమెరికా, యూరప్  వంటి దేశాల్లో ఏ ఐఫోన్‌ ఎక్కువ కాలం పని చేస్తుందో.. ఆ సిరీస్‌ ఫోన్‌లను సొంతం చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఒకవేళ ఐఫోన్‌ -14 సిరీస్‌ ఫోన్‌ ధరలు ఎక్కువగా ఉంటే వారి అభిప్రాయాలు మార్చుకోవచ్చు. 

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ముగ్గురు కొనుగోలుదారులలో ఇద్దరు 2 ఏళ్లు అంతకంటే తక్కువ రోజులు మాత్రమే ఐఫోలను వినియోగిస్తున్నారు. ఐఫోన్ -14 సిరీస్‌కి అప్‌గ్రేడ్ చేయాలనుకోవడానికి వేగవంతమైన ప్రాసెసర్‌లు, ఎక్కువ స్టోరేజ్‌, కెమెరా పనితీరు  ప్రధాన కారణాలని పేర్కొన్నారు.  

తాము అప్‌గ్రేడ్ చేయబోమని తెలిపిన యూజర్లు వారి ప్రస్తుత ఐఫోన్‌లు బాగా పనిచేయడం, అలాగే ఐఫోన్‌ 14 సిరీస్‌ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణం.

>
మరిన్ని వార్తలు