Forgotten Password: పాస్‌వర్డ్‌ మరిచిపోవడంతో... పది లక్షల కోట్ల రూపాయలు ఆగం...!

26 Sep, 2021 17:47 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి మంచి ఆదరణ లభిస్తోంది. బిట్‌కాయిన్‌ లాంటి క్రిప్టోకరెన్సీలు ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్రిప్టోకరెన్సీ లావాదేవీలు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరుగుతాయి. శక్తివంతమైన కంప్యూటర్ల సహయంతో, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీనుపయోగించి క్రిప్టో లావాదేవీలను జరుపుతుంటారు.  బిట్‌కాయిన్స్‌ను కల్గిన పలు వ్యక్తులు తమ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోనే సౌకర్యం ఉంటుంది. బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌కు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ సహాయంతో ఇతరులకు బిట్‌కాయిన్ల లావాదేవీలను చేయవచ్చును.
చదవండి:  క్రిప్టోకరెన్సీ నుంచి పొంచి ఉన్న పెనుముప్పు...!

పది లక్షల కోట్ల రూపాయలు గాల్లోనే...!
బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్‌ మర్చిపోతే మాత్రం బిట్‌కాయిన్‌ యూజర్లు తిరిగి పొందే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒ‍కవేళ బిట్‌కాయిన్‌ వ్యాలెట్‌ పాస్‌వర్డ్‌ మర్చిపోతే... బిట్‌కాయిన్లు ఆన్‌లైన్‌లో అలానే ఉండిపోతాయి.  ది న్యూయర్క్‌ టైమ్స్‌ ప్రకారం...దాదాపు 140 బిలియన్‌ డాలర్లు (రూ. 1,03,66,51,70,00,000 సుమారు పది లక్షల కోట్ల రూపాయలు) బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్ మర్చిపోవడంతో ఈ మొత్తాన్ని బిట్‌కాయిన్‌ యూజర్లు క్లెయిమ్‌ చేసుకోలేదని వెల్లడించింది. క్రిప్టోకరెన్సీ డేటా సంస్థ చైనాలిసిస్‌ నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. 18.6 బిలియన్‌ బిట్‌కాయిన్ల మైనింగ్‌లో 20 శాతం మేర బిట్‌కాయిన్స్‌లో ఏలాంటి లావాదేవీలు లేకుండా నిద్రాణస్థితిలో ఉన్నాయని తెలిపింది.ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల యూజర్లు పాస్‌వర్డ్స్‌ను మర్చిపోవడమే దీనికి కారణమని చైనాలిసిస్‌ పేర్కొంది.  

ఆశాదీపంగా హ్యాకర్లే వారికి దిక్కు...!
బిట్‌కాయిన్‌ వ్యాలెట్ల పాస్‌వర్డ్స్‌ను మర్చిపోయినా బిట్‌కాయిన్‌ యూజర్లకు డార్క్‌వెబ్‌లోని ఆన్‌లైన్‌ హ్యాకర్లే దిక్కుగా కన్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయా బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను యాక్సెస్‌ చేసేందుకు బిట్‌కాయిన్‌ యూజర్లు హ్యకర్ల సహయాన్ని తీసుకుంటున్నారు. బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేసిన హ్యకర్లకు కొత్త మొత్తాన్ని బిట్‌కాయిన్‌ యూజర్లు చెల్లిస్తున్నట్లు క్రిప్టో అసెట్‌ రికవరీ టీమ్‌ వెల్లడించింది. కాగా బిట్‌కాయిన్‌ వ్యాలెట్లను రికవరీ చేసే సంభావ్యత కేవలం 27 శాతంగానే ఉంది. 
చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...!

మరిన్ని వార్తలు