Coding Contest: టెన్త్‌ క్లాస్‌ కుర్రాడికి అమెరికా బంపరాఫర్‌,భారీ ప్యాకేజ్‌తో పిలుపు..అంతలోనే

24 Jul, 2022 07:45 IST|Sakshi

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ జాబ్‌. పైసా ఖర్చులేకుండా భారత్‌ నుంచి అమెరికా వచ్చేందుకు ఫ్రీగా ఫ్లైట్‌ టికెట్‌. కళ్లు చెదిరే ప్యాకేజీ ఇస్తామంటూ పిలుపు అందింది. కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ అంతలోనే సదరు సంస్థ ఆ కుర్రాడికి భారీ షాకిచ్చింది. 

నాగపూర్‌కు చెందిన రాజేష్‌, అశ్వనీ దంపతుల కుమారుడు వేదాంత్ డియోకటే (15) 10వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా విద్యార్ధులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే టెన్త్‌ క్లాస్‌ చదివే వేదాంత్‌ ఆన్‌లైన్‌ క్లాసులతో పాటు ఆన్‌లైన్‌లో డజన్ల కొద్ది కోడింగ్‌ కోర్స్‌లు నేర్చుకున్నాడు. 

రెండు రోజుల్లో
ఈ తరుణంలో తల్లీ అశ్వినీకి చెందిన ల్యాప్‌ట్యాప్‌లో వేదాంత్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ బ్రౌజ్‌ చేస్తుండగా..వెబ్‌సైట్‌ డెవలప్మెంట్ కాంపిటీషన్‌ జరుగుతుంది. ఎవరైనా పాల్గొన వచ్చంటూ ఓ లింక్‌ కంట పడింది. అంతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ 15ఏళ్ల కుర్రాడు కోడింగ్‌ కాపింటీషన్‌లో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో హెచ్‌టీఎంఎల్‌,జావా స్క్రిప్ట్‌,వర్చువల్‌ స్టూడియో కోడ్‌ (2022) 2,066 రాశాడు. దేశ వ్యాప్తంగా 1000మంది పాల్గొన్న ఈ కోడింగ్‌ కాంపిటీషన్‌లో వేదాంత్‌ తనకిచ్చిన టార్గెట్‌ను విజయవంతంగా పూర్తిచేశాడు.

ఖండాంతరాలు దాటిన ప్రతిభ
ఈ కాంపిటీషన్‌లో వేదాంత్‌ చూపించిన ప్రతిభ ఖండాంతరాలు దాటింది. అమెరికా న్యూజెర్సీకి చెందిన యాడ్‌ ఏజెన్సీ సంస్థ ఆర్‌ అండ్‌ డి డిపార్ట్‌మెంట్‌లో జాబ్‌ ఇస్తామని, సంవత్సరానికి రూ.33లక్షల ప్యాకేజీ ఇస్తామని పిలిచింది. తీరా వేదాంత్‌ ఎడ్యుకేషన్‌తో పాటు వయస్సు చాలా చిన్నది కావడంతో తాము ఇస్తామన్న ఆఫర్‌ను విరమించుకుంటున్నామని.. విద్యార్ధిగా సాధించిన విజయాలు ఇంకా ఉన్నాయంటూ యూఎస్‌  కంపెనీ తెలిపింది.   

వేదాంత్‌ ప్రతిభ అమోఘం 
ఈ కుర్రాడి ప్రతిభ అమోఘం, అనుభవం, ప్రొఫెషనలిజం, అప్రోచ్‌ అయ్యే విధానం చాలా బాగుంది. వేదాంత్‌కు జాబ్‌ ఇప్పుడు ఇవ్వలేకున్నా.. ఉన్నత చదువులు పూర్తి  చేసిన తర్వాత అతను కోరుకున్న జాబ్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మమ్మల్ని సంప్రదించవచ్చంటూ అమెరికన్‌ యాడ్‌ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు.

మరిన్ని వార్తలు