డ్రోన్‌ పైలట్ల శిక్షణకు 150 స్కూల్స్‌!

30 May, 2022 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా డ్రోన్‌ పైలట్లకు శిక్షణనిచ్చేందుకు 2025 నాటికి సుమారు 150 స్కూల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డ్రోన్‌ డెస్టినేషన్‌ సీఈవో చిరాగ్‌ శర్మ తెలిపారు. ఇందుకోసం యూనివర్సిటీలు, వ్యవసాయ రంగ సంస్థలు, పోలీస్‌ అకాడమీలతో చేతులు కలపనున్నట్లు వివరించారు.

 దేశీయంగా తొలి రిమోట్‌ పైలట్‌ ట్రైనింగ్‌ సంస్థగా డ్రోన్‌ డెస్టినేషన్‌ .. అనుమతులు పొందింది. ప్రస్తుతం ఆరు స్కూల్స్‌ను నిర్వహిస్తోంది. త్వరలో కోయంబత్తూర్, మదురైలో మరో రెండు ప్రారంభించనున్నట్లు శర్మ పేర్కొన్నారు.

 గడిచిన కొన్ని నెలలుగా తాము 500 మంది పైలట్లకు శిక్షణ కల్పించినట్లు వివరించారు. రాబోయే ఏడాది కాలంలో గురుగ్రామ్‌ కేంద్రంలో 1,500 – 2,000 మంది పైలట్లకు, మిగతా కేంద్రాల నుంచి తలో 500 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శర్మ తెలిపారు.   

మరిన్ని వార్తలు