17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్‌ మస్క్‌తో కలిసి

3 Dec, 2022 12:32 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లాలో భారత్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్ధికి అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌కు చెందిన విద్యార్ధి అపరూప్ రాయ్ టెస్లాలో ఫుడ్ ప్రింటింగ్ ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం సొంతం చేసుకున్నారు. అయితే టెస్లాలో పనిచేసే అవకాశం రావడానికి కారణం అతను చేసిన ప్రయోగాలేనని తెలుస్తోంది.  .  

►భూమిపై మానవ జీవన విధానానికి ఆటంకం కలిగించే కోవిడ్ -19, దొమల నివారణ వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు రాయ్‌ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాసా, ఇఎస్ఎ, జాక్సా వంటి అంతరిక్ష సంస్థల నుండి ఇఓ డాష్ బోర్డ్ హ్యాకథాన్‌లో పాల్గొన్నందుకు సర్టిఫికేషన్‌ పొందాడు. దీంతో పాటు దోమల నివారణ కోసం మూలికా పదార్థాలను ఉపయోగించి ఆవు పేడను తయారు చేస్తున్నట్లు తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నాడు. 

►దోమల్ని నివారించేందుకు మార్కెట్‌లో లభించే మందుల వల్ల అనేక అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందువల్లే ఆవుపేడతో మూలికల్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 

►10వ తరగతి చదివే సమయంలో 'ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ కెమిస్ట్రీ', 'మాస్టర్ ఐసీఎస్ఈ కెమిస్ట్రీ సెమిస్టర్', 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్', 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్', 'జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ మెటీరియల్స్' అనే రెండు పుస్తకాలను రాశాడు.  

►2020లో ఇస్రో సైబర్ స్పేస్ కాంపిటీషన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్ ) 11, వేదాంత మాస్టర్ స్కాలర్ షిప్ టెస్ట్ (వీశాట్ )లో ఏఐఆర్ 706 ర్యాంకు సాధించాడు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో ఇంట్లో కరెంట్‌ వినియోగం కోసం నీటిలో ఉప్పును కరిగించడంతో సహా అనేక ప్రయోగాలు చేశాడు. దీని కోసం అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) శాస్త్రవేత్తల సహాయం తీసుకున్నాడు. 'లాక్ డౌన్ ఉన్న సమయంలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు, అందుకే నా ప్రయోగాలన్నీ ఇంట్లోనే చేయాల్సి వచ్చింది' అని ఈ సందర్భంగా రాయ్ చెప్పాడు.

►కాగా, పశ్చిమ బెంగాల్‌కు చెందిన యవ శాస్త్రవేత్త రాయ్‌ తన 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. జెఈఈలో ర్యాంకు సాధించేందుకు కృష్టి చేస్తున్నాడు. తద్వారా భవిష్యత్‌లో ఐఐటి బాంబేలో ఉన్నత విధ్యను అభ‍్యసించాలని కోరుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు