కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఒకే గొడుగు కిందకు రైల్వే సేవలు..!

11 Feb, 2022 17:59 IST|Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ధ రైల్వే వ్యవస్థ మన ఇండియాలో ఉంది అనే  సంగతి మనకు తెలిసిందే. అయితే, ఇంత పెద్ధ రైల్వేశాఖలో ప్రస్తుతం ఎన్నో విభాగాలు పని చేస్తున్నాయి. ఈ అన్ని రైల్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కింద ప్రతిపాదనలు చేసింది. అయితే, అప్పటి ప్రతిపాదనలు ఇప్పుడు అమలు చేసేందుకు సిద్ద పడుతుంది. ప్రస్తుతం అన్ని రైల్వే డిపార్ట్‌మెంట్స్‌ను కలిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం కేంద్రం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇండియన్‌ రైల్వే మేనేజ్‌మెంట్‌ సెర్వీస్‌(ఐఆర్ఎంఎస్)ను గ్రూప్‌ 'ఏ' సెంట్రల్‌ సెర్వీసెస్‌ కిందకు తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యల వల్ల కొత్త అధికారుల నియమించుకోవాల్సి ఉంటుంది. 2019లో రైల్వే అధికారులకు ఒకే కేడర్ ఉండాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. అనేక డిపార్ట్‌మెంట్స్‌ వీడి విడిగా ఉండటం వల్ల  అధికారులు మధ్య బేదాభిప్రాయాలు వస్తున్నాయి. దీంతో, అతి పెద్ద రైల్వే వ్యవస్థలో వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం కలుగుతుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్తు అవసరాలను తీర్చగల స్థాయికి చేరడానికి అన్నీ రైల్వే విభాగాలను కాలపాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. ఈ రైల్వే విభాగాల విలీనం రైల్వే బ్యూరోక్రసీలో అతిపెద్ద సంస్కరణగా అధికారులు పరిగణిస్తున్నారు. 

ఇంత పెద్ద రైల్వే శాఖలో సంస్కరణలను తీసుకురావడానికి, వేగంగా ఆధునికీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే మొదట కేంద్రం 150 మంది అధికారులను నియమించుకోవడం ద్వారా ఈ ప్రక్రియను మొదలు పెట్టనున్నట్లు కొంత మంది అధికారులు తెలిపారు. నియామకాలు చేపట్టడంలో ఆలస్యం చేయడంలేదని, రిటైర్‌ అవుతున్న సీనియర్లను పరిశీలించి కొత్తగా ఆఫీసర్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని తెలిపారు. ఈ రిక్రూర్‌మెంట్‌కు సంబంధించి కొత్త నియమ నిబంధనలు బయటకు రావాల్సి ఉంది. 

(చదవండి: క్రిప్టోకరెన్సీలపై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!)

మరిన్ని వార్తలు