2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా?

20 Feb, 2024 14:38 IST|Sakshi

టెస్లా పవర్ ఇండియా ఇటీవల తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా ఏకంగా 2,000 మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. ఇంజినీరింగ్, ఆపరేషన్స్, సేల్స్, మార్కెటింగ్, సపోర్ట్ ఫంక్షన్‌లలోని వివిధ విభాగాలలో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు సంస్థ ప్రకటనలో వెల్లడించింది.

సస్టైనబుల్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ సేవలను అందిస్తున్న టెస్లా పవర్ కంపెనీ బ్యాటరీ బ్రాండ్ రీస్టోర్‌ను కూడా ప్రారంభించింది. కంపెనీ ఈ 2026 నాటికి దేశవ్యాప్తంగా ఈ రీస్టోర్‌ యూనిట్లను సుమారు ఐదు వేలకు చేర్చడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే వివిధ రంగాల్లో ఉద్యోగులను నియమించుకోవడానికి సన్నద్దమవుతోంది.

భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించడంతో భాగంగా ప్రతిభావంతులైన కొత్త ఉద్యోగులను తీసుకోనున్నట్లు, వారికి మా సహకారాన్ని అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామని టెస్లా పవర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కవిందర్ ఖురానా అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు