బీఎండబ్ల్యూ  6 సిరీస్‌ కొత్త వెర్షన్‌ 

9 Apr, 2021 09:50 IST|Sakshi

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ సెడాన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌

ప్రారంభ ధర రూ.67.9 లక్షలు 

సాక్షి,  ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ తన 6 సిరీస్‌ సెడాన్‌ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.67.9 లక్షలుగా ఉంది. సరికొత్త వెర్షన్‌ను పెట్రోల్, రెండు డీజిల్‌తో సహా మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచారు. పెట్రోల్‌ వేరియంట్‌లో లభ్యమయ్యే 630ఐ ఎమ్‌ స్పోర్ట్‌లో 2.0 లీటర్‌ ఇంజిన్‌ను అమర్చారు.

ఇది 258 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధర రూ.67.9 లక్షలుగా ఉంది. డీజిల్‌ వేరియంట్లలో లభించే 620డీ కారులో 2.0 లీటర్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీని ధరను రూ.68.9 లక్షలుగా నిర్ణయించారు.  అదేవిధంగా 630డీ కారులో అమర్చిన 3 లీటర్ల ఇంజిన్‌ 190 హెచ్‌పీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కూడా కేవలం 6.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ వేరియంట్‌ ధర రూ.77.9 లక్షలుగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాలను దృష్టిలో పెట్టుకొని 6  సిరీస్‌ సెడాన్‌లో కొత్త వెర్షన్‌ విడుదల చేసినట్లు కంపెనీ ఎండీ విక్రమ్‌ పావా తెలిపారు. 

మరిన్ని వార్తలు