మహీంద్రా థార్‌కు పోటీగా మార్కెట్‌లోకి గూర్ఖా...! లాంచ్‌ ఎప్పుడంటే..?

11 Sep, 2021 18:29 IST|Sakshi

 Force Gurkha SUV: స్పోర్ట్స్ యూటిలీటీ వెహికిల్‌(ఎస్‌యూవీ) శ్రేణిలో మహీంద్రా థార్‌కు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. భారత మార్కెట్‌లో మహీంద్రా థార్‌కు పోటీగా ఫోర్స్‌ మోటార్స్‌ గూర్ఖా ఎస్‌యూవీను  ఈ నెల 15న లాంచ్‌ చేయనుంది. గత సంవత్సరం గ్రేటర్‌ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఫోర్స్‌ గూర్ఖా ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది. ఈవెంట్‌లో చూపించిన విధంగానే ఎటువంటి మార్పులు లేకుండా బహిరంగ మార్కెట్‌లోకి రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: బడాబడా కంపెనీలు భారత్‌ వీడిపోవడానికి కారణం ఇదేనా..! 


ఫోర్స్ మోటార్స్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫోర్స్ గూర్ఖా వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఎస్‌యూవీ కారు ధరలు ఈ నెలాఖరులో ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఫోర్స్‌ గూర్ఖా ధర రూ. 8లక్షల నుంచి 10 లక్షల వరకు ఉండవచ్చునని ఆటో మొబైల్‌ రంగ నిపుణుల భావిస్తోన్నారు. ఫోర్స్‌ గూర్ఖాకు సింగిల్-స్లాట్ గ్రిల్, ఎల్‌ఈడీ ప్రో ఎడ్జ్ హెడ్‌ల్యాంప్‌లతో పాటు డే టైం రన్నింగ్‌ ల్యాంప్స్‌, కొత్త బ్రాండింగ్‌తో కూడిన ఫెండర్ ల్యాంప్, ఫాగ్ ల్యాంప్స్, క్లామ్‌షెల్ బోనెట్,  వెనుక డోర్‌కు మౌంటెడ్ స్పేర్ వీల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. వర్టికల్‌ టెయిల్‌లైట్లు, హై-మౌంటెడ్ ఎల్‌ఈడీ లైట్లను గూర్ఖాకు అమర్చినట్లు తెలుస్తోంది. 

కారు ఇంటీరియర్స్‌ విషయానికి వస్తే మాట్టే బ్లాక్ డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌తో గూర్ఖా రానుంది. కారులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా అమర్చినట్లు తెలుస్తోంది.  2.6-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కారులో అమర్చారు. 89 బీహెచ్‌పీ సామర్థ్యంతో 260ఎన్‌ఎమ్‌ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది.  5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడవనుంది.


చదవండి: సెడాన్‌ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం

మరిన్ని వార్తలు