కవాసాకి నింజా స్పోర్ట్స్‌ బైక్‌  సూపర్‌ : ధర ఎంతంటే?

17 Mar, 2021 12:00 IST|Sakshi

కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ 2021 లాంచ్‌

నింజా జెడ్‌ఎక్స్ -10 ఆర్‌  ధర రూ. 14,99,000 (ఎక్స్-షోరూమ్)

సాక్షి, ముంబై:  జపాన్‌కు చెందిన ప్రముఖ  బైక్స్‌ తయారీదారు  సరికొత్త అప్‌డేట్స  కవాసాకి మరో సూపర్‌బైక్‌ను లాంచ్‌  చేసింది. సరికొత్త, డిజైన్‌, అప్‌డేట్స్‌తో ఈ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. కవాసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్‌ 2021  పేరుతో తీసుకొచ్చిన దీని ధరను అక్షరాలా 15 లక్షలుగా నిర్ణయించింది. తద్వారా మరో సూపర్‌బైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ (వరల్డ్‌ఎస్‌బికె) టైటిల్‌ రేసులో దూసుకుపోనుంది.  లైమ్ గ్రీన్, ఫ్లాట్ ఎబోనీ టైప్ 2 అనే 2 రంగులలో ఇది లభిస్తుంది. (ఆల్‌న్యూ క్రెటా అమ్మకాల జోరు)

2021 కవాసాకి నింజా జెడ్‌ఎక్స్ -10 ఆర్  ఫీచర్లు
998 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజీన్‌ ( ఇన్-లైన్ 4 మోటారు) 13,200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 203 పవర్‌ని ప్రొడ్యూస్‌ చేస్తుంది. 11,400 ఆర్‌పీఎం వద్ద 114.9 ఎన్‌ఎం గరిష్ట టార్క్ ను అందిస్తుంది . 6 స్పీడ్ గేర్‌బాక్స్  అప్‌డేటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ ఆల్-ఎల్ఇడి లైటింగ్, షోవా బిఎఫ్ఎఫ్ (బ్యాలెన్స్ ఫ్రీ ఫ్రంట్ ఫోర్క్), షోవా బిఎఫ్‌ఆర్‌సి లైట్ (బ్యాలెన్స్ ఫ్రీ రియర్ కుషన్) వెనుక మోనోషాక్, ఎలక్ట్రానిక్ థొరెటల్ వాల్వ్స్‌, కొత్త ఎయిర్-కూల్డ్ ఆయిల్ కూలర్, క్లోజ్-రేషియోను కలిగి ఉంది. ఇంకా టిఎఫ్‌టి డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ క్రూయిజ్ కంట్రోల్, 3 పవర్ మోడ్స్‌ (ఫుల్,మీడియం, లో),  మూడు రైడింగ్ మోడ్స్‌ (స్పోర్ట్ / రోడ్ /రైన్ /రైడర్ (మాన్యువల్) ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్  అనే 5 మోడ్స్‌ ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. విండ్‌స్క్రీన్‌తోపాటు సైడ్ ప్యానెల్స్‌తో పాటు అప్‌డేట్‌ చేసింది. అలాగే హ్యాండిల్ బార్ అండ్‌  ఫుట్ పెగ్ పొజిషన్లను కూడా ఇచ్చింది. రియర్‌ సీటును సౌకర్యవంతంగా రూపొందించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు