ప్రతి నెల పదివేలు చెల్లిస్తే మారుతి స్విఫ్ట్ కారు మీదే

13 Apr, 2021 19:38 IST|Sakshi

దేశంలో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారు మోడల్ మార్కెట్లోకి విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో కొనసాగుతోంది. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను పొందుతుంది. ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అవుట్‌గోయింగ్ మోడల్ నుంచి ముందుకు తీసుకెళ్లబడ్డాయి. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్‌టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్‌లో 35 శాతం వాటా దీనిదే కావడం విశేషం. ఇక ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి: డేంజర్ జోన్‌లో వాట్సప్‌ యూజర్లు!

మరిన్ని వార్తలు