మార్కెట్‌లోకి స్కోడా ఆక్టావియా ఫోర్త్‌ జనరేషన్‌ కారు

11 Jun, 2021 15:03 IST|Sakshi

ప్రారంభ ధర రూ.25.99 లక్షలు

ముంబై: స్కోడా ఆటో ఇండియా తన ప్రీమియం సెడాన్‌ ఆక్టావియా కారు కొత్త వెర్షన్‌ను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. కొత్త స్కోడా ఆక్టేవియా రెండు వేరియంట్ల' లో లభిస్తుంది. ఇందులో స్టైల్‌ వేరియంట్‌ ధర రూ.25.99 లక్షలుగా, లారిన్‌ - క్లైమెంట్‌ వేరియంట్‌ ధర రూ.28.99 లక్షలుగా ఉంది. నాలుగో తరానికి చెందిన ఈ కారు రెండు 2.0 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 190 పీఎస్‌ శక్తిని ఇస్తుంది. లీటరుకు 15.81 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఇందులో మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ కూడా ఉంది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ మొత్తం ఎనిమిది ఎయిర్‌ బ్యాగులను అమర్చారు. అలాగే ఏబీఎస్, ఎల్రక్టానిక్‌ స్టెబిలిటీ కంట్రల్‌ (ఈఎస్‌సీ), ఈబీడీ, టైర్‌ ప్రెజర్‌ మోనిటరింగ్‌ సిస్టమ్‌ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అత్యవసర వేళలో ఉపయోగపడే ‘‘మైస్కోడా కనెక్ట్‌’’ అనే ఇన్‌బిల్ట్‌ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. దేశవ్యాప్తంగా డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్‌ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్‌ మ్యాట్రిక్స్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌, హారిజంటల్‌ ఫాగ్‌ల్యాంప్స్‌ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్‌ డిజైన్‌లోనూ మార్పులు చేశారు.

చదవండి: కోవిడ్‌-19 పోరులో భారీగా ఖర్చు చేసిన టాటా గ్రూప్‌

మరిన్ని వార్తలు