ట్యాక్సీ వాహనాల కోసం సరికొత్త టాటా ఎలక్ట్రిక్ కారు విడుదల

21 Jul, 2021 16:14 IST|Sakshi

ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ తాజాగా కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ విభాగాలు, ట్యాక్సీ సర్వీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా 'ఎక్స్‌ప్రెస్‌' పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. టిగోర్ ఫేస్ లిఫ్ట్ ఆధారంగా ఎలక్ట్రిక్ సబ్ కాంపాక్ట్ సెడాన్ అయిన ఎక్స్‌ప్రెస్‌-టీ ఎలక్ట్రిక్ వాహన ధరలను టాటా ఇప్పుడు అధికారికంగా ప్రకటించింది. ఇది పాత టిగోర్ ఈవీని రీప్లేస్ చేస్తుంది. ఎక్స్ ఎమ్+ ధర రూ. 9.75 లక్షలు, ఎక్స్ టీ+ ధర రూ.9.9 లక్షలుగా ఉంది. ఎంపిక చేసిన టాటా డీలర్ షిప్ల వద్ద బుకింగ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి.

ఈ సెగ్మెంట్‌లో తక్కువ ధర, ప్యాసింజరు సౌకర్యం, భద్రత అణాలను దృష్టిలో ఉంచుకుని ఈ వాహనాలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే వాటికి, ఈ కేటగిరీ వాటికి మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా వీటిపై ఎక్స్‌ప్రెస్‌ బ్యాడ్జ్ ఉంటుందని టాటా మోటార్స్‌ వివరించింది. ఎక్స్‌ప్రెస్‌-టీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లతో వస్తుంది. 165 కి.మీ క్లెయిం రేంజ్ తో 16.5కెడబ్ల్యుహెచ్, 213 కిలోమీటర్ల క్లెయిం రేంజ్ తో 21.5కెడబ్ల్యుహెచ్. దీనిలోని బ్యాటరీ ప్యాక్ 70వీ, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ తో జత చేశారు. ఇది 40హెచ్ పీ, 105 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

2021 టాటా ఎక్స్‌ప్రెస్‌-టీని ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు. వీటిని చార్జ్ చేయడానికి కనీసం పది గంటలు పడుతుంది. లుక్స్ పరంగా చూస్తే ఎక్స్‌ప్రెస్‌-టీ కొత్త బాడింగ్ కొన్ని నీలం ఇన్సర్ట్ లు, గ్లోస్-బ్లాక్ ఫ్లాట్ గ్రిల్, 14 అంగుళాల అలాయ్ వీల్స్ కలిగి ఉంది. దీనిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్, ఈబీడీ, ఎల్ఈడి హెడ్ లైట్లు, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చులు, అందుబాటు ధర సౌకర్యవంతమైన అనుభూతి వంటి అంశాల కారణంగా నగరాల్లో ప్రయాణాలకు ఎలక్టిక్‌ వాహనాలు అనుకూలంగా ఉంటాయని పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు