భారత మార్కెట్లోకి బోన్‌విల్‌ బాబర్‌ కొత్త బైక్‌

26 May, 2021 15:02 IST|Sakshi

ధర రూ.11.75 లక్షలు 

ముంబై: బ్రిటన్‌ ప్రీమియం మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ ట్రయంఫ్‌ మంగళవారం తన బోన్‌విల్‌ బాబర్‌ మోడల్‌ అప్‌డేట్‌ వెర్ష్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌ షోరూం వద్ద రూ.11.75 లక్షలుగా ఉంది. ఇందులో ఇంజిన్‌తో పాటు సాంకేతికతను, ఎక్విప్‌మెంట్‌ను ఆధునీకరించారు. ఈ బైక్‌లో 1200 సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 6100 ఆర్‌పీఎమ్‌ వద్ద 78 పీస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్‌ యూరో 5 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉద్గారాలను, ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఈ బైక్‌కి బ్లాక్‌ కలర్‌ అవుట్‌లుక్‌ ఇవ్వబడింది. 12 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్‌ ట్యాంక్‌ను అమర్చారు. రోడ్, రైన్‌ రైడింగ్‌ మోడ్‌లతో వస్తుంది. బాబర్‌ బ్రాండ్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉందని, అందుకే ఏడాది విరామం తర్వాత దేశీయ మార్కెట్లోకి తీసుకున్నామని ట్రయంఫ్‌ మోటార్‌ సైకిల్స్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ సోహెబ్‌ ఫారూక్‌ తెలిపారు.

చదవండి:

ఎస్‌బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు