బజాజ్‌ పల్సర్‌125కు  పోటీగా టీవీఎస్‌ నుంచి అదిరిపోయే బైక్‌..!

14 Sep, 2021 18:04 IST|Sakshi

ప్రముఖ బైక్ల తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ మార్కెట్లలోకి మరో కొత్త బైక్‌ను రిలీజ్‌ చేయనుంది. కంపెనీ నుంచి రాబోయే బైక్‌ను టీవీఎస్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో టీజ్‌ చేసింది.‘ 2021 టీవీఎస్‌ రైడర్‌’ బైక్‌ను ఈ నెల 16 న అధికారికంగా లాంచ్‌ చేయనుంది. ఈ బైక్‌ 125 సీసీ ఇంజన్‌ సెగ్మెంట్‌లో రానుందని తెలుస్తోంది.  బజాజ్‌ పల్సర్‌ 125, ది హోండా సీబీ షైన్‌ ఎస్‌పీ బైక్లకు 2021 టీవీఎస్‌ రైడర్‌ పోటీగా నిలవనుంది.
చదవండి: కియా కా కమాల్‌... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్‌ కారు అమ్మకాలు

టీజర్‌లో భాగంగా 2021 టీవీఎస్‌ రైడర్‌ బైక్‌కు ముందుభాగంలో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌(డే టైమ్ రన్నింగ్‌ ల్యాప్స్‌), అల్లాయ్‌ వీల్స్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ ఫోర్స్‌, మోనో షాక్‌, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది.

బైక్‌కు డిజిటల్‌ రివర్స్‌ డిస్‌ప్లే కూడా రానుంది. స్పోర్టీ లూక్‌తో 2021 టీవీఎస్‌ రైడర్‌ మరింత ఆకర్షణీయంగా ఉండనుంది. ఈ బైక్‌ ధర (ఎక్స్-షోరూమ్) సుమారు రూ.  80,000 నుంచి 90,000 మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది.  (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో ఉంచే అవకాశం ఉంది .  


చదవండి: సెడాన్‌ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం

మరిన్ని వార్తలు