ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ కారు..! 

31 Jan, 2022 16:40 IST|Sakshi

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ కారును ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్‌ మార్టిన్‌ లాంచ్‌ చేయనుంది. ఆస్టన్‌ మార్టిన్‌ 2022 DBX ఎస్‌యూవీకు చెందిన టీజర్‌ను కంపెనీ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. 

లాంచ్‌ ఎప్పుడంటే..!
ఆస్టన్‌ మార్టిన్‌ 2022 DBX ఎస్‌యూవీ కారును రేపు (ఫిబ్రవరి 1)న రిలీజ్‌ చేయనుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లగ్జరీ ఎస్‌యూవీగా నిలుస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు లంబోర్ఘిని ఉరస్‌ కారుకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ కొత్త తరం డీబీఎక్స్‌ ఎస్‌యూవీ పలు మార్పులతో రానున్నట్లు కంపెనీ పేర్కొంది. 

సరికొత్తగా ఆస్టన్‌ మార్టిన్‌ 2022 డీబీఎక్స్‌..!
ఆస్టన్‌ మార్టిన్‌ 2022 డీబీఎక్స్‌ను భారీ మార్పులతో, మరింత ఆకర్షణీయంగా రానుంది. రీడిజైన్‌ చేసిన ఫ్రంట్‌ గ్రిల్‌, కొత్త సెట్‌ డేటైమ్‌ రన్నింగ్‌ లైట్స్‌ రీపోజిషన్‌ చేయబడ్డాయి. కొత్త వీల్‌ డిజైన్స్‌తో సరికొత్త కలర్‌ కాంబినేషన్‌తో రానుంది. 

ఇంజన్‌ విషయానికి వస్తే..!
న్యూ ఆస్టన్‌ మార్టిన్‌ 2022 డీబీఎక్స్‌ ఎస్‌యూవీ అభివృద్ధి చేసిన కొత్త టర్బోఛార్జ్డ్‌ వీ12 ఇంజిన్‌తో రానుంది. ఈ ఇంజిన్‌ గరిష్టంగా 650 hp శక్తిని ఉత్పత్తి చేయనుంది. మునపటి మోడల్‌ కంటే 100  hp అధిక శక్తిని విడుదల చేయనుంది. 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 4.5 సెకన్లలో అందుకోనుంది. గరిష్టంగా 290 kmph వేగంతో ప్రయాణించనుంది. 
 


చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా కారు..!

మరిన్ని వార్తలు