వారెవ్వా ఆడి..గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది!

4 Feb, 2022 08:22 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఆడి ‘క్యూ7 ఎస్‌యూవీ’ కొత్త వెర్షన్‌ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది.

ఎక్స్‌షోరూం ధర క్యూ7 ప్రీమియం ప్లస్‌ రూ.79.99 లక్షలు, క్యూ7 టెక్నాలజీ రూ.88.33 లక్షలు ఉంది. 48వీ మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో 3.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్, 8 ఎయిర్‌బ్యాగ్‌లను పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుంది. 

రూ.5ల‌క్ష‌లు చెల్లించి కార్ బుక్ చేసుకోవ‌చ్చు 
లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్‌ ప్రీమియం ఎస్‌యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు గ‌తంలో ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

లేటెస్ట్ టెక్నాల‌జీ ఫీచ‌ర్ల‌తో
2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించామ‌ని ఆడి ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్‌ ఎయిర్‌ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్‌ డ్రైవ్, పార్క్‌ అసిస్ట్‌ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.

మరిన్ని వార్తలు