డుకాటి ఇండియా సూపర్‌ బైక్స్‌: దిమ్మ దిరిగే ధరలు

30 Aug, 2022 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: డుకాటి ఇండియా 2022 పానిగేల్‌ వీ4 రేంజ్‌  బైక్స్‌ను విడుదల చేసింది.  వీటి ధర రూ. 26.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. వేరియంట్‌లు ఉన్నాయి - స్టాండర్డ్, ఎస్‌,ఎస్‌పీ-2 ఇలా మూడు వేరియంట్లలో ఈ సూపర్‌ బైక్‌ అందుబాటులో ఉంది.   అయితే  ఫీచర్లను అప్‌డేట్‌ చేయడమే కాదు ధరలను  కూడా అదే రేంజ్‌లో పెంచేసింది. 

కొత్త గ్రాఫిక్‌లతోపాటు, అద్భుతమైన డిజైన్తో 2022 పనిగేల్  వీ4  బైక్స్‌ని అప్‌డేట్‌ చేసింది.  ఇక ధరల విషయానికి వస్తే బేస్‌ వేరియంట్‌ ధరను గతం కంటే రూ. 3 లక్షలు పెంచింది. ఎస్ ధర రూ. 31.99 లక్షలు (గతం కంటే రూ. 3.59 లక్షలు ఎక్కువ) ఎస్‌పీ2 ధర రూ. 40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)( సుమారు 4 లక్షలు ఎక్కువ) .ఢిల్లీ, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో మొత్తం 3 వేరియంట్‌ల బుకింగ్స్‌ అందుబాటులో ఉన్నాయి.

 ఇంజీన్‌  1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజన్ . దీనికి కొత్త సైలెన్సర్ ఆయిల్ పంప్‌ను  జోడించింది.  తద్వారా ఈ ఇంజీన్‌  సామర్థ్యం 13,000 RPM వద్ద 215.5 HP , 9500 RPM వద్ద 123.6 Nm వరకుపెరిగిందని కంపెనీ ప్రకటించింది.  ఇంకా  ఫుల్లీ  రెడ్ ఫెయిరింగ్‌లపై బ్లాక్ లోగోలు, డబుల్ ఫాబ్రిక్ సాడిల్,  బ్లాక్ రిమ్స్‌పై రెడ్ ట్యాగ్ (S వేరియంట్‌లో) జోడించింది. 

 హై ఎండ్‌ వేరియంట్‌  ఎస్‌పీ 2లో
1103 cc డెస్మోసెడిసి స్ట్రాడేల్ ఇంజిన్‌నే అమర్చింది. ఇంకా  ఇటాలియన్ ఫ్లాగ్‌తో కూడిన కార్బన్ ఫైబర్‌లో వింగ్స్, STM-EVO SBK 9-డిస్క్ డ్రై క్లచ్, డెడికేటెడ్ ఫ్రంట్  అండ్‌ రియర్ స్ప్రాకెట్స్‌,  520 చైన్, ఎడ్జస్టబుల్‌  రైడర్ ఫుట్-పెగ్‌ లాంటి ఫీచర్లు ఇందులో  ఉన్నాయి. రిమోట్ అడ్జస్టర్, మెషిన్డ్ బ్రేక్ చ, క్లచ్ లివర్‌లతో కూడిన బ్రెంబో MCS మాస్టర్ సిలిండర్, 9-స్పోక్ ఫోర్డ్ మెగ్నీషియం వీల్స్, కార్బన్ ఫైబర్‌లో ఫ్రంట్ మడ్‌గార్డ్ , సింగిల్ సీట్  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు