కళ్లుచెదిరేలా..2022 ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో

5 Aug, 2022 12:09 IST|Sakshi

2022 ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో ఢిల్లీలో ప్రారంభం

బిగ్గెస్ట్‌ ఎకోఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికల్‌ టెక్నాలజీ ఎక్స్‌పో

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో 2022 అట్టహాసంగా పప్రారంభమైంది. శుక్రవారంమొదలైన ఈ షో  మూడురోజుల పాటు ఆగస్ట్‌ 7 వరకు కొసాగుతుంది. అతిపెద్ద ఆటో షోగా భావిస్తున్న ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో ఉపకరణాలు, బ్యాటరీలు, ఇతర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. 

కేంద్ర సమాచార  ప్రసార  క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. ద"ఇండియాస్ ఈవీ సెక్టార్: రోడ్‌మ్యాప్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్" పేరుతో ఆగస్టు 4న నిర్వహించిన ఒకరోజు సెమినార్ తర్వాత ఈ ఎక్స్‌పో జరుగుతోంది. ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్‌పో జరుగుతోంది.   సుమారు 100 మంది భారతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా  ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లు, స్కూటర్లు, రిక్షాలు, కార్ట్‌లు, ఇతర ఆటో ఉత్పత్తులు ఈ వేదిక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ లభిస్తోందని,రానున్న కాలంలో డిమాండ్‌మరింతర పుంజుకోనుందని  ఎక్స్‌పో 2022 నిర్వాహకుడు రాజీవ్ అరోరా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ-వాహనాల తయారీదారులందరిని ఒకవేదికమీదకు తీసకొస్తున్న ఈ ఎక్స్‌పోలో పలు లాంచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎక్స్‌పో  ప్రధాన లక్ష్యం కొత్త వ్యాపారాన్ని సృష్టించడం, పర్యావరణ పరిరక్షణ  అని ఆయన పేర్కొన్నారు. కాగా  2015లో తొలిసారిగా నిర్వహించబడిన ఇలాంటి ఎక్స్‌పోలు న్యూఢిల్లీ ,కోల్‌కతాలో బెంగళూరు, లక్నో, హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు