ఎస్‌యూవీ లవర్స్‌ కోసం: సరికొత్తగా న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్

13 Jul, 2022 15:11 IST|Sakshi

సాక్షి, ముంబై: దక్షిణ కొరియా ఆటోమేకర్ హ్యుందాయ్ టక్సన్ 2022నికొత్త డిజైన్‌తో ఇండియన్‌ మార్కెట్లో లాంచ్‌ చేయనుంది. న్యూ-జెన్ హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ ఆగస్ట్ 4  ఇండియాలో లభ్యం కానుంది. కొత్త డిజైన్‌, పలు సేఫ్టీ ఫీచర్లతో దీన్ని  తీసుకురానుంది.

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్‌ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసిన హ్యుందాయ్‌ తాజాగా ఎస్‌యూవీ కార్‌ లవర్స్‌ కోసం 2022 హ్యుందాయ్ టక్సన్ పోలరైజింగ్ డిజైన్, AWD, ADAS  లాంటి ఫీచర్లు జోడించింది. హ్యుందాయ్  బెస్ట్‌  ఎస్‌యూవీగా ఉన్న ఈ కారు  ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో  అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ టక్సన్: డిజైన్,  ఫీచర్లు
ఇంటిగ్రేటెడ్ LED DRLలతో కొత్తగా రూపొందించిన 'పారామెట్రిక్-జువెల్' గ్రిల్‌ను ఫ్రంట్ ఫాసియా , బంపర్‌పై హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్‌తో పాటు పదునైన కట్‌తో  స్పోర్టినెస్ డిజైన్‌తో  తీర్చిదిద్దింది. 

6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC/VSM, హిల్ స్టార్ట్-స్టాప్ అసిస్ట్,  లెవల్ 2 ADAS సూట్ వంటి 60 ప్లస్ సేఫ్టీ ఫీచర్‌, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ , డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ లాంటి అనేక ఫీచర్లతో హ్యుందాయ్ టక్సన్ వస్తుంది. వాయిస్ ఆదేశాలకు మద్దతు ఇచ్చే హ్యుందాయ్ బ్లూలింక్ సిస్టమ్‌ ఉంది. ఇంటీరియర్‌ విషయానికి వస్తే  10.25అంగుళాల టచ్‌స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్‌లాంటి ఫీచర్లున్నాయి. 

హ్యుందాయ్ టక్సన్: ఇంజీన్‌ ,  ధర
6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త Nu 2.0 పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొత్త ఆర్‌ 2.0 డీజిల్ ఇంజన్‌తో లభించనుంది. అంతేకాకుండా, ఇంజిన్‌లు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో పని చేస్తాయి. ఎలాంటి కఠినమైన భూభాగంలో నావిగేట్ చేయగల సామర్థ్యం దీని సొంతం. 

హ్యుందాయ్ టక్సన్ ధరను ఇంకా అధికారికంగా వెల్లడికానప్పటికీ, దాదాపు రూ. 23 లక్షలు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో జీప్ కంపాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్,  ఇతర మోడళ్లతో పోటీపడనుంది.

మరిన్ని వార్తలు