అదిరిపోయిన ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా అదుర్స్!

6 Feb, 2022 17:22 IST|Sakshi

ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా జెడ్ఎస్ ఈవీ 2022 మోడల్ ఎలక్ట్రిక్ కారును త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ ఆటోమేకర్ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని అక్కడ విడుదల చేసింది. భారతదేశంలో విడుదల కానున్న మోడల్ కారుతో పోలిస్తే ఇది భిన్నంగా కనిపిస్తుంది. యుకెలో, ఎంజీ మోటార్స్ కొత్త జెడ్ఎస్ ఈవీ ధరను కూడా ప్రకటించింది. దీని ధర 28,190 పౌండ్ల నుంచి 34,690 పౌండ్ల మధ్య ఉంటుంది. మన దేశ కరెన్సీలో ₹28.48 లక్షల నుంచి ₹35.05 లక్షలు(ఎక్స్ షోరూమ్) వరకు ఉండనుంది. 

మన దేశంలో లాంఛ్ చేసిన తర్వాత 2022 ఎంజి జెడ్ఎస్ ఈవీ కారు టాటా నెక్సన్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీతో పోటీ పడనుంది. 2022 జెడ్ఎస్ ఈవీ ఆర్కిటిక్ వైట్, బ్లాక్ పెర్ల్, బాటర్ సీ బ్లూ, మాన్యుమెంట్ సిల్వర్, డైనమిక్ రెడ్ అనే ఐదు విభిన్న రంగులలో లభ్యం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కొత్త డిజైన్ అలాయ్ వీల్స్'తో వస్తుంది. ప్రస్తుతం, లభిస్తున్న ఎలక్ట్రిక్ కారుతో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చేర్పులను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ముందు వైపు చేయబోయే అప్‌డేట్‌లు, కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎమ్‌జి ఆస్టర్ డిజైన్‌కు చేరువగా ఉండే అవకాశం ఉంది.

ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్‌లు, కొత్త టెయిల్‌ల్యాంప్‌లతో పాటుగా మరికొన్ని ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇంకా ఇందులో కొత్త బంపర్స్, ముందు వైపు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో ఇది మరింత ఏరోడైనమిక్‌గా కనిపించనుంది. లోపలి భాగంలో, అప్‌డేట్ చేయబడిన ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎంజీ ఈస్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

622 కిలోమీటర్ల రేంజ్
ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 2022 రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ల్లో లభ్యం అవుతుంది. ఒకటి 51 కి.డబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్, రెండవది 73 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇ 73 కెడబ్ల్యుహెచ్ వాటర్ కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పవర్డ్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 2022 622 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది అని బ్రిటిష్ ఆటోమేకర్ పేర్కొంది. 51 కి.డబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల కారు 333 కిమీ రేంజ్ అందించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఎస్‌యువి కారు 156 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.2 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదూ. కొత్త జడ్ఎస్ ఈవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. దీని బ్యాటరీ సుమారు ఒక గంటలో 80 శాతం ఛార్జ్ కూడా కానుంది.

(చదవండి: పొదుపు ఖాతా వడ్డీరేట్లను సవరించిన ఆ మూడు బ్యాంకులు..!)

మరిన్ని వార్తలు