బెస్ట్‌ సెల్లింగ్‌ కార్‌.. 5 లక్షల కంటే తక్కువ ధరలోనే రెనాల్ట్‌ క్విడ్‌

14 Mar, 2022 16:56 IST|Sakshi

భారత ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌ కార్లకు భారీ ఆదరణ నెలకొంది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు పలు ఆటోమొబైల్‌ కంపెనీలు సరికొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం రెనాల్ట్‌ ఇండియా సరికొత్తగా రెనాల్ట్‌ క్విడ్‌ MY22 ఆర్‌ఎక్స్‌(ఓ)కారును లాంచ్‌ చేసింది. 

రెనాల్ట్‌ క్విడ్‌ను కంపెనీ 2015లో ప్రారంభించగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా క్విడ్‌ యూనిట్లు అమ్ముడయ్యాయి. క్విడ్‌ అమ్మకాలను మరింత పెంచేందుగాను రెనాల్ట్‌ ఇండియా సరికొత్త MY22 రెనాల్ట్ క్విడ్‌ను RXL(O) వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఈ కారు 1.0L MT, 0.8L రెండు ఎంపికలలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. 

డిజైన్‌లో సరికొత్తగా..!
క్విడ్ క్లైంబర్ ఎడిషన్ కొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ కలర్‌తో స్పోర్టీ వైట్ యాక్సెంట్‌లను కలిగి ఉంది. 8 అంగుళాల టచ్‌స్క్రీన్ MediaNAV ఎవల్యూషన్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ రానుంది. ఇది ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్‌కు సపోర్ట్‌ చేయనుంది. ఈ కారుకు సిల్వర్ స్ట్రీక్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌తో మరింత ఆకర్షణగా నిలవనుంది. దీంతో పాటుగా రివర్స్ పార్కింగ్ కెమెరా , ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఓఆర్‌వీఎమ్‌ ఉన్నాయి.

ధర ఎంతంటే..!
2022 రెనాల్ట్ క్విడ్ లాంచ్ ధర రూ. 4.49 లక్షలుగా(ఎక్స్‌షోరూమ్‌) ఉంది. డ్యూయల్ టోన్‌ బ్లాక్ రూఫ్‌తో మెటల్ మస్టర్డ్ , ఐస్ కూల్ వైట్, మోనోటోన్‌ మూన్‌లైట్ సిల్వర్, జన్స్కార్ బ్లూ కలర్ ఆప్షన్లలో 2022 MY22 రెనాల్ట్ క్విడ్‌ అందుబాటులో ఉండనుంది. 

ఇంజన్‌ విషయానికి వస్తే..!
కొత్త క్విడ్‌లో ఎలాంటి మెకానికల్‌గా ఎలాంటి మార్పులు చేయలేదు. రెండు పెట్రోల్ ఇంజన్ల ఎంపికతో అందుబాటులో ఉండనుంది. 0.8-లీటర్ ఇంజన్‌ క్విడ్‌ 53 బిహెచ్‌పి, 72 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. మరొక వేరియంట్‌ 1.0-లీటర్ ఇంజన్67 బీహెచ్‌పీ, 91 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా వస్తుంది. 

చదవండి: మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్‌ గుర్ఖా..!

మరిన్ని వార్తలు