మార్కెట్లో విడుదలైన 2023 కియా కారెన్స్.. ఇందులో కొత్తగా ఏముందంటే?

17 Mar, 2023 12:31 IST|Sakshi

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ 'కియా మోటార్స్' భారతీయ మార్కెట్లో రియల్ డ్రైవింగ్ ఎమిషన్స్ (RDE) ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేటెడ్ కారెన్స్ విడుదల చేసింది. ఇది అప్డేటెడ్ ఇంజిన్ ఆప్సన్ మాత్రమే కాకుండా ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. 

వేరియంట్స్ & ధరలు:

అప్డేటెడ్ కియా కారెన్స్ ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ అనే ఐదు వేరియంట్స్‌లో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా టాప్ వేరియంట్ ధర రూ. 18.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే టర్బో-పెట్రోల్, డీజిల్ వేరియంట్‌ల ధరలు దాని మునుపటి మోడల్ కంటే రూ. 50,000, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్ ధరలు రూ. 25,000 ఎక్కువ.

ఇంజిన్ ఆప్సన్స్:

కొత్త కియా కారెన్స్ E20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిక్స్డ్) కంప్లైంట్ ఇంజన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ రాబోయే BS6 ఫేజ్ 2 & RDE ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉండి 157.8 బిహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT యూనిట్ పొందుతుంది.

(ఇదీ చదవండి: మారుతి బ్రెజ్జా సిఎన్‌జి కావాలా.. ఇప్పుడే బుక్ చేసుకోండి!)

డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్: 

2023 కియా కారెన్స్ డిజైన్ పరంగా దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 4.2 ఇంచెస్ కలర్ MIDతో 12.5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. అంతే కాకుండా 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, UVO కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బోస్ సౌండ్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, రియర్ వ్యూ కెమెరా వంటివి ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్:

ఆధునిక కాలంలో డిజైన్, ఫీచర్స్ మాత్రమే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న వాహనాలను కొనుగోలుచేయడానికి కస్టమర్లు ఎక్కువ ఆస్కతి చూపుతున్నారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. 2023 కారెన్స్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ISOFIX మౌంట్‌లు, హిల్-హోల్డ్ అసిస్టెన్స్ వంటి వాటిని పొందుతుంది.

(ఇదీ చదవండి: విడుదలకు సిద్దమవుతున్న మారుతి కార్లు: కొత్త జిమ్నీ నుంచి ఫ్రాంక్స్ వరకు..)

ప్రత్యర్థులు:

అప్డేటెడ్ కియా కారెన్స్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ధరల పరంగా ఎర్టిగా రూ. 8.35 లక్షల నుంచి రూ. 12.79 లక్షల మధ్య ఉంటుంది. ఎక్స్ఎల్6 ధరలు రూ. 11.41 లక్షల నుంచి రూ. 14.67 లక్షల వరకు ఉంది. కావున ఈ విభాగంలో కారెన్స్ ధర కొంత ఎక్కువగానే ఉంది, కానీ రానున్న కొత్త నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంది.

మరిన్ని వార్తలు