ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి 

13 Aug, 2020 08:13 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రైవేట్‌ రైళ్ల నిర్వహణకు 21 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఆల్‌స్టోమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఇండియా లిమిటెడ్, బొంబార్డియర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇండియా లిమిటెడ్, సిమెన్స్‌ లిమిటెడ్, జీఎంఆర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌తో పాటు మరికొన్ని ప్రభుత్వరంగ కంపెనీలు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లలో, 109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్లు నడిపేందుకు మొదలైన సన్నాహాల్లో భాగంగా మొదటి దశగా భావించే ప్రీ–అప్లికేషన్‌ సమావేశానికి ఆసక్తి చూపుతున్న ఈ కంపెనీలు హాజరైనట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ సమావేశంలో కంపెనీలు క్లస్టర్ల ఆవశ్యత, అర్హత ప్రమాణాలు, బిడ్డింగ్‌ ప్రక్రియ, రైళ్ల సేకరణ, ఛార్జీలు, కార్యకలాపాలు నిర్వహణ, రైళ్ల సమయం, రాకపోకలు వంటి అనేక ప్రశ్నలను రైల్వేశాఖ ముందుంచారు. రైల్వే, నీతిఆయోగ్‌ అధికారులు ఈ ప్రశ్నలకు వివరణలు ఇచ్చినట్లు జాతీయ రవాణశాఖ తెలిపింది.

>
మరిన్ని వార్తలు