Ajay Singh Tanwar: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?

25 May, 2023 16:18 IST|Sakshi

Ajay Singh Tanwar: భారతదేశంలో ధనవంతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో 'అజయ్ సింగ్ తన్వర్' కూడా ఒకరు. పాతికేళ్ళు కూడా నిండని ఈ యువకుడు ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడిపే వ్యక్తులలో కూడా ఒకరుగా ప్రసిద్ధి చెందాడు. ఇతడు ఉపయోగించే కార్లలో చాలా వరకు ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉండటం గమనార్హం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

నిజానికి అజయ్ తన్వర్ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన 'కన్వర్ సింగ్ తన్వర్' మనవడు. ఢిల్లీకి చెందిన సంపన్న పారిశ్రామికవేత్త అజయ్ సింగ్ తన్వర్ రాజకీయ, వ్యాపారం రంగాలకు చెందిన కుటుంబంలో జన్మించారు. ఇతడు ప్రపంచములోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కార్లను కలిగి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో రోల్స్ రాయిస్ ఘోస్ట్, రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ వంటి ఖరీదైన కార్లను కూడా చూడవచ్చు.

అజయ్ గ్యారేజీలో మూడు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లు, మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ లగ్జరీ సెడాన్ వంటివి ఉన్నాయి. ఈ మెర్సిడెస్ బెంజ్ కారు ధర రూ. 2.79 కోట్లని తెలుస్తోంది. దీనితో పాటు కస్టమైజ్డ్ వైట్ ఫోర్డ్ ముస్టాంగ్ సెడాన్‌, మెర్సిడెస్ బెంజ్జి 63 AMG వంటివి కూడా ఇతని గ్యారేజిలో ఉండటం గమనార్హం. భారతీయ రోడ్ల మీద అరుదుగా కనిపించే 'హమ్మర్ హెచ్2' కూడా ఇతని వద్ద ఉంది. దీనిని భారతదేశానికి ప్రైవేట్‌గా దిగుమతి చేసుకోవడం జరిగింది.

(ఇదీ చదవండి: వాట్సాప్‌లో అదిరిపోయే 'ఎడిట్ మెసేజ్ ఫీచర్‌'.. దీన్నెలా వాడాలో తెలుసా?)

రూ. 3 కోట్ల విలువైన లెక్సస్ LX530, రూ. 1.94 కోట్ల విలువైన బిఎండబ్ల్యు ఎక్స్5 ఎమ్, రూ. 1.5 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్, రూ. 2.30 విలువైన ఆడి ఆర్8 స్పోర్ట్స్, ఆడి ఆర్ఎస్5, లంబోర్ఘిని గల్లార్డో కార్లు మాత్రం కాకుండా DC రూపొందించిన రూ. 2 కోట్ల విలువైన కారవ్యాన్ కూడా ఉంది. కార్లు మాత్రమే కాకుండా రెండు హెలికాఫ్టర్లు కూడా ఉన్నాయి.

(ఇదీ చదవండి: వెయ్యికోట్ల సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత్రి - సక్సెస్ స్టోరీ)

నివేదికల ప్రకారం, అజయ్ చత్తర్‌పూర్‌లో ఉన్న ఓషన్ పెరల్ గార్డెనియా, కింగ్స్ ఫోర్త్ అనే రెండు హోటళ్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యాపారం అనేది కుటుంబం నుంచి వారసత్వంగా లభించినట్లు గతంలోనే వెల్లడించారు. వ్యాపారంలో ఇతని కృషికి ఎలైట్ మ్యాగజైన్ 'మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ 2020' అవార్డును కూడా అందించింది.

మరిన్ని వార్తలు