GST on Online Gaming, Casinos: క్యాసినో,ఆన్‌లైన్‌ గేమింగ్‌పై భారీ జీఎస్టీ.. ఎంతంటే!

18 Jul, 2022 14:04 IST|Sakshi

గేమింగ్‌ ఇండస్ట్రీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరిలో ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. 

గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు,మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు,తెలంగాణకు చెందిన రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్‌ గేమింగ్‌పై ట్యాక్స్‌ విధింపును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మంత్రుల బృందానికి మేఘాలయ సీఎం కాన్‌రాడ్ సంగ్మా నాయకత్వం వహించనున్నారు. దేశంలో బెట్టింగ్, జూదంతో పాటు సరిసమానంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్ను విధించాలని మంత్రుల ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనల మేరకు 28 శాతం గేమింగ్‌పై జీఎస్టీ పడనుంది. 

జీఎస్టీ ఖరారు ఎప్పుడంటే
ఆన్‌లైన్‌ గేమింగ్‌పై జీఎస్టీని ఖరారు చేయడానికి ఆర్ధిక మంత్రుల బృందం జూలై 23న బెంగళూరులో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను ఫెడరల్ జీఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తుంది.

దీంతో పాటు ఆన్‌లైన్‌ గేమ్‌లో పెట్టే బెట్టింగ్‌పై 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తుంది. క్యాసినోల విషయంలో, ఎంట్రీ పాయింట్ వద్ద చెల్లించిన మొత్తంపై ట్యాక్స్‌ విధించాలని నిర్ణయించబడింది. ప్రతిసారి కాకుండా చిప్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ జీఎస్టీ ఉండనుంది. హార్స్ రైడింగ్‌లో పందెం మొత్తంపై 28 శాతం జిఎస్టి విధించే ప్రస్తుత పద్ధతి కొనసాగుతుందని ప్రతిపాదించబడింది.

మరిన్ని వార్తలు