Instagram: ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ డేటా లీక్‌.. కిమ్ క‌ర్దాషియ‌న్ తో పాటు

22 Oct, 2021 18:50 IST|Sakshi

లక్షల సంఖ్యలో ఇన్‌ స్ట్రాగ్రామ్‌, టిక్‌టాక్‌ యూజర్లు ప్రమాదంలో పడనున్నారు. ఈ రెండు సోషల్‌ నెట్‌ వర్క్‌లలో 'ఎలాస్టిక్‌ సెర్చ్' అనే అన్‌ సెక్యూర్డ్‌ సర్వర్‌ ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్స్‌ సంస్థ తెలిపింది. ఈ సర్వర్‌ ద్వారా 2.6 మిలియన్ల యూజర్లకు చెందిన 3.6 జీబీ డేటా లీకైంది. తద్వరా 2 మిలియన్లకు పైగా సోషల్‌ మీడియా యూజర్లపై ప్రభావం పడనుందని అంచనా వేసింది. ఇక డేటా లీకైన యూజర్లలో ఆలిసియా కీస్‌ ఆరియానా గ్రాండే, రియాలిటీ టీవీషోలతో, హాట్‌ మోడలింగ్‌తో గ్లోబల్‌ వైడ్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న కిమ్‌ కర్దాషియన్‌తో పాటు పలువురు ఫుడ్‌ బ్లాగర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయన్సర్లు ఉన్నట్లు  సేప్టీ డిటెక్టివ్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది.   

జులై 5న గుర్తించింది
సోషల్‌ మీడియా అనలిటిక్స్‌ సైట్‌ IGBlade.com సోషల్‌ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌కు సంబంధించి ఫాలోవర్స్‌ గ్రోత్‌, ఎంగేజ్‌మెంట్, అకౌంట్‌ పర్మామెన్స్‌ గురించి తెలుసుకునేందుకు కొన్ని టూల్స్‌ను వినియోగిస్తుంది.  ఆ టూల్స్‌ వినియోగం కోసం ఐజీబ్లేడ్‌.కామ్‌ రక్షణలేని సర్వర్లను వినియోగిస్తుందని, అలా చేయడం వల్ల సోషల్‌ మీడియా అకౌంట్లలో ఉన్న యూజర్ల డేటా లీక్‌ అవుతుందనే విషయాన్ని ఈ ఏడాది జులై5 న సేప్టీ డిటెక్టివ్‌ సంస్థ గుర్తించింది.

ఆ డేటాలో ఏముంది  
ఇక ఈ అన్‌వాంటెడ్‌ సర్వర్ల కారణంగా లీకైనా సోషల్‌ మీడియా యూజర్లకు చెందిన బయోడేటా తోపాటు అడ్రస్‌, కాంటాక్ట్‌ నెంబర్లు, ప్రొఫైల్‌ పిక్చర్స్‌కు సంబంధించిన లింకులన్నీ ఈ లీకైన రికార్డుల్లో ఉన్నట్లు సేప్టీ డిటెక్టివ్‌ నిపుణలు వెల్లడించారు. ఇలా డేటా లీక్‌ అవ్వడం తొలిసారి కాదని  2020 ఆగస్ట్‌ నెలలో కంపేరిటచ్ అనే సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, యూట్యూబ్‌ యూజర్లు 235 మిలియన్ల మందికి పైగా డేటా లీకైనట్లు గుర్తించింది.

చదవండి: ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!

మరిన్ని వార్తలు