Lamborghini Aventador Car: ఇండియాలో రెండో లక్కీయెస్ట్‌ ఓనర్‌!

3 Jul, 2022 15:53 IST|Sakshi

సాక్షి, ముంబై: లగ్జరీ స్పోర్ట్స్ కార్లు అండ్ ఎస్‌యూ‌వీలను అందించే ఇటలీ కార్‌ మేకర్‌ లంబోర్ఘిని లేటెస్ట్‌ సూపర్‌ కార్‌ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్‌  రెండో కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. గ్లోబల్‌గా  లిమిటెడ్‌ ఎడిషన్‌గా లాంచ్‌ చేసిన ఈ కారులో రెండోది  ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టనుంది. 

దేశంలో రెండో కారుగా  అల్టిమే రోడస్టర్‌ ఎల్‌పీ 780-4ను రు ముంబైకి చెందిన వ్యక్తి సొంతంచేసుకున్నారు. అవెంటడార్ అల్టిమే రోడ్‌స్టర్ రెండో కారును డెలివరీ చేశామని లంబోర్ఘిని ఇండియా హెడ్ శరద్ అగర్వాల్  వెల్లడించారు. లంబోర్ఘిని చరిత్రలో  అత్యాధునిక టెక్నాలజీ, సూపర్‌ డిజైన్‌ను ఇందులో  జోడించింది. అలాగే 6.5-లీటర్ల వీ12 ఇంజిన్‌తో  8,500rpm వద్ద 769bhp,  6,750rpm వద్ద 720Nm పీక్ టార్క్‌ను విడుదల చేస్తుంది.  కేవలం 2.9 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.  ఇండియాలో దీని ధర సుమారు 8కోట్ల రూపాయలు.

కాగ అవెంటడోర్ అల్టిమే రోడ్‌స్టర్‌ కారుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 600 యూనిట్లను మాత్రమే విక్రయించనుంది లంబోర్ఘిని.  కూపే, రోడస్టర్‌ అనే రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. గ్లోబల్‌గా కూపే మోడల్‌లో 350, రోడ్‌స్టర్ బాడీ స్టైల్‌లో  250 యూనిట్లను విక్రయించ నున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు