2021 వాట్సాప్ లో వచ్చే కొత్త ఫీచర్స్ ఇవే!

23 Dec, 2020 17:50 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు పొందిన మెసేజింగ్ యాప్ లలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే వాట్సాప్‌ ఎప్పుడు వరుసగా అనేక అప్‌డేట్లు తీసుకొస్తూ కస్టమర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు చాట్ వాల్ పేపర్స్, మ్యూట్ ఆల్వేస్, గ్రూప్ వీడియో కాల్స్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. వచ్చే ఏడాది 2021లో కూడా ఇలాంటి సరికొత్త ఫీచర్స్ తీసుకురావాలని వాట్సాప్ భావిస్తుంది. అవేంటో మనం ఒకసారి తెలుసుకుందామా..(చదవండి: 2020 వాట్సాప్ లో వచ్చిన టాప్-10 ఫీచర్స్)  

వాట్సాప్ టర్మ్స్ & ప్రైవసీ పాలసీ 
వాట్సాప్ యూజర్లు వచ్చే ఏడాదిలో రాబోయే వాట్సాప్ కొత్త నిబంధనలు, ప్రైవసీ పాలసీలను అంగీకరించాలని పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఒకవేల ఎవరైతే ఈ నిబంధనలను అంగీకరించారో వారు వాట్సాప్ ఖాతాని తొలిగించనున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలను 2021 ఫిబ్రవరి 8 నుండి తీసుకురానున్నట్లు పేర్కొంది. వాట్సాప్ భద్రత విషయంలో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనల్లో వినియోగదారుల డేటాని ఏ విదంగా ఉపయోగిస్తారో తెలియాజేయనున్నట్లు పేర్కొన్నారు. 

డెస్క్‌టాప్ లో ఆడియో, వీడియో కాల్స్ 
ప్రస్తుతం మొబైల్ వాట్సాప్ వినియోగదారులు వినియోగిస్తున్న ఆడియో వాయిస్ కాలింగ్, వీడియో కాలింగ్ ఫీచర్ లను వచ్చే ఏడాదిలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం తీసుకురానున్నట్లు పేర్కొంది. వాబీటాఇన్ఫో ప్రకారం.. వాయిస్ కాలింగ్, వీడియో కాల్‌ ఫీచర్ లు డెస్క్‌టాప్ బీటా యూజర్లకు ఇప్పటికే అందుబాటులో ఉన్నట్లు పేర్కొంది. వచ్చే ఏడాదిలో మిగతా అందరికి లభించనున్నట్లు పేర్కొంది. ఈ కాలింగ్ కోసం ప్రత్యేకంగా ఒక పాప్ అప్ వస్తుంది అని సంస్థ పేర్కొంది.  

 

పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్
వాట్సాప్ తన ఐఓఎస్ వినియోగదారుల కోసం పేస్ట్ మల్టీపుల్ ఐటమ్స్ ఫీచర్ ని వచ్చే ఏడాదిలో తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ ఫీచర్ లో భాగంగా మల్టీపుల్ ఫోటోలను, వీడియోలను కాపీ చేసి చాట్ లో పేస్ట్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం మల్టీపుల్ ఐటమ్స్ ని ఎంచుకొని ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి టాప్‌ చేసి తర్వాత ‘కాపీ’ చేయాలి. ఇప్పుడు ఆ ఐటమ్స్ ని మీకు నచ్చిన వారికే ఒకేసారి పంపించవచ్చు. 
 

మరిన్ని వార్తలు