అంతరిక్షంలో అలజడి!! దడేల్ మంటూ చంద్రుడిని ఢీకొట్టిన శకలాలు!

5 Mar, 2022 19:38 IST|Sakshi

ఎస్‌. ప్రపంచ దేశాలు ఊహించినట్లే జరిగింది. చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించిన స్పేస్‌ రాకెట్‌ వేస్టేజ్‌ చంద్రుడిని ఢీకొట్టాయి. అయితే ఆ ఢీకొట్టనున్న..ఢీకొట్టిన వ్యర్ధాలు తాము ప్రయోగించిన రాకెట్ల నుంచి విడుదలైనవి కాదని చైనా ఇప్పటికే వాదించింది.  

2014లో బీజింగ్‌ నుంచి లూనార్‌ ఎక్స్‌ ప్లోరేషన్‌ ప్రోగ్రామ్‌ పేరిట  చైనా ఛేంజ్‌ 5-టీ1 అనే రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించింది. ఆ రాకెట్‌ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్‌ బూస్టర్‌ (స్పేస్‌ రాకెట్‌ భాగాలు) మార్చి నెలలో చంద్రుడిని ఢీకొట్టనున్నాయని సైంటిస్ట్‌లు గుర్తించారు. అనుకున్నట్లే  శుక్రవారం రోజు మూడుటన్నుల బరువున్న రాకెట్‌ స్క్రాప్‌ చంద్రుడిని ఢీకొట్టడంతో అంతరిక్షంలో అలజడి నెలకొంది. 

33 అడుగుల నుండి 66 అడుగుల (10 నుండి 20 మీటర్లు) వరకు పెద్దదిగా ఉండే రాకెట్‌ స్క్రాప్‌  గంటకు 9,300 కిలోమీటర్ల (గంటకు 5,800 మైళ్ళు) అత్యంత వేగంతో ఢీకొట్టాయి. ఆ ప్రభావంతో ఆ శకలాలు చంద్రుని ఉపరితలం మీదుగా వందల కిలోమీటర్లు సైంటిస్ట్‌లు ఎగిరినట్లు గుర్తించారు. మరోవైపు ఆ రాకెట్‌ స్క్రాప్‌ ఎలన్‌ మస్క్‌ స్పేస్‌లో జరిపిన అంతరిక్ష ప్రయోగం భాగంలోని ఓ రాకెట్‌ అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏడేళ్ల క్రితం జరిగిన ప్రయోగంలో రాకెట్‌ వ్యర్ధాలు ఇప్పుడు చంద్రుడిని ఢీకొట్టాయనే భిన్న వాదనలు తెరపైకి వచ్చాయి. కాగా, చంద్రుడిని ఢీకొట్టిన రాకెట్‌ స్క్రాప్‌ ఎవరిదనే అంశంపై స్పేస్‌ సైంటిస్ట్‌లు ప్రయోగాలు ముమ్మరం చేశారు. దీన్ని గురించి కొలిక్కి రావాలంటూ మరో రెండు లేదా మూడు వారాలు సమయం పడుతుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు