మైక్రోసాఫ్ట్‌లో మూడో రౌండ్‌ తీసివేతలు, ఈసారి ఎవరంటే?

11 Mar, 2023 14:04 IST|Sakshi

న్యూఢిల్లీ:  టెక్‌దిగ్గజాల్లో వరుసగా ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మెటా  మరో దఫా  జాబ్‌ కట్స్‌ను ప్రకటించగా తాజాగా  మైక్రోసాఫ్ట్ మూడవ రౌండ్ ఉద్యోగ కోతలను నిర్వహించింది.ముఖ్యంగా. సరఫరా గొలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)కి సంబంధించిన  ఉద్యోగులను తొలగించింది.  

అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 10వేల  ఉద్యోగాల కోతలలో  భాగంగానే వీరిని తొలగించిందని సీఆర్‌ఆన్‌ నివేదించింది. 689 మంది ఉద్యోగులను శాశ్వతంగా తొలగించినట్లు టెక్ దిగ్గజం సోమవారం తన సొంత రాష్ట్రానికి నివేదించింది. వివిధ స్థాయిలు, విధులు, టీమ్స్‌,  భౌగోళికాల్లో ఉద్యోగాల కోతలు ఉన్నాయని కంపెనీని ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.రికార్డుల ప్రకారం వాషింగ్టన్ రాష్ట్రంలో టెక్ దిగ్గజం ఇటీవల 689 మందిని ఫిబ్రవరిలో, 617 మంది ఉద్యోగులను తొలగించింది, ఇదే నెలలో, 108 మందిని,  జనవరిలో, మైక్రోసాఫ్ట్ 878 మందిపై వేటు వేసింది. దీంతో  వాషింగ్టన్‌ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,184కి చేరుకుంది.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్‌కు బై..బై చెప్పి ప్రత్యర్థి కంపెనీకి సీఎండీగా బాధ్యతలు

కాగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లింక్డ్ఇన్ పోస్ట్ ప్రకారం, కంపెనీ తన ఏఐ ఆధారిత ఆటోమేషన  ప్రాజెక్ట్ బోన్సాయ్‌ను మూసివేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం టీంను కూడా   తొలగించింది.  ప్రస్తుతం కంపెనీలో  సుమారు  220,000కు పైగా  ఉద్యోగులు ఉండగా, వీరిలో  5 శాతం మందిని లేఆఫ్స్‌  ప్రభావితం చేసింది. మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల  ఈ ఆర్థిక సంవత్సరం  మూడో త్రైమాసికం చివరి నాటికి  మొత్తం పదివేల ఉద్యోగాలు తగ్గించే  ప్లాన్లను గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు