మహీంద్రా థార్‌కు పోటీ..! సరికొత్తగా రానున్న ఫోర్స్‌ గుర్ఖా..!

14 Mar, 2022 16:05 IST|Sakshi

ఆఫ్‌ రోడ్‌ కార్లలో మహీంద్రా థార్‌ అత్యంత ఆదరణను పొందింది.  ఈ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్‌, మారుతి సుజుకీ జిమ్నీ కార్లకు పోటీగా ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం ఫోర్స్‌ మోటార్స్‌ గుర్ఖా ఎస్‌యూవీను లాంచ్‌ చేసింది. తాజాగా గుర్ఖాను సరికొత్తగా తెచ్చేందుకు ఫోర్స్‌ సన్నాహాలను చేస్తోంది. 

5 డోర్‌ వెర్షన్‌లో సరికొత్తగా..!
గత ఏడాది ఫోర్స్‌ మోటార్స్‌ ఆఫ్‌ రోడ్‌ సెగ్మెంట్‌లో గుర్ఖాను తీసుకొచ్చింది.తొలుత 3 డోర్‌ వెర్షన్‌ గుర్ఖాను ఫోర్స్‌ మోటార్స్‌ లాంచ్‌ చేసింది. దీనికి అదనంగా మరిన్నీ సీట్లను యాడ్‌ చేస్తూ 5 డోర్‌ వెర్షన్‌ గుర్ఖాను త్వరలోనే లాంచ్‌ చేస్తామని ఫోర్స్‌ తెలియజేసింది. ఇప్పుడు తాజాగా 5 డోర్‌ వెర్షన్‌ గుర్ఖా టెస్టింగ్‌ మోడల్‌కు సంబంధించిన చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఎస్‌యూవీను త్వరలోనే లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.  నయా ఫోర్స్‌ గుర్ఖా ఎస్‌యూవీలో 6-7 సీట్ల సదుపాయం ఉండనుంది. 

అదే డిజైన్‌..ఇంజిన్‌తో..!
ఫోర్స్‌ గుర్ఖా ఎస్‌యూవీ 5-డోర్‌ వెర్షన్‌ కారు అదే డిజైన్‌ , ఇంజిన్‌తో వచ్చే అవకాశాలున్నాయి. డ్యూయల్‌ ఎయిర్‌బ్యాగ్స్‌,  ఏబీఎస్‌ విత్‌ ఈబీడీ, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్‌, టూఐర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, స్పీడ్‌ అలెర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం బ్లాక్‌ థీమ్‌తో ఇంటీరియర్‌ రూపొందించారు.

ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్‌లో ఆండ్రాయిడ్‌ ఆటో, ఆపిల్‌ కార్‌ ప్లేలు వర్క్‌ చేస్తాయి. డ్రైవర్‌ డిస్‌ప్లేను సెమి డిజిటల్‌గా అందించారు. 2.6 ఫోర్‌ సిలిండర్‌ బీఎస్‌ 6 ప్రమాణాలు కలిగిన డీజిల్‌ ఇంజన్‌ అమర్చారు. 5 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. గూర్ఖా ఇంజన్‌ 90 బీహెచ్‌పీతో 250 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.

చదవండి: అలా చేస్తే సగం ధరకే పెట్రోల్‌, డీజిల్‌..!

మరిన్ని వార్తలు