Ganesh Laddu Auctioned: వేలంలో రూ.41లక్షలు పలికిన లడ్డూ.. ఎక్కడంటే?

22 Sep, 2021 15:10 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల్లో ఘనంగా జరిగాయి. పండుగ సందర్భంగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర రూ.18.90 లక్షలు పలకగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన మరో లడ్డు ధర రికార్డ్‌ స్థాయిలో రూ.41లక్షలు పలికింది.  

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ సన్‌ సిటీకి చెందిన కీర్తి రిచ్‌మాండ్‌ విల్లాస్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో 179విల్లాస్‌లో 82 మంది నివసిస్తున్నారు. అయితే స్థానికులు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని నిర్వహించారు. పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని జరిపిన లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ను క్రియేట్‌ చేసింది. లడ్డూ వేలం పాటలో 5 కేజీల లడ‍్డూ రూ.41లక్షలు పలికినట్లు నిర్వాహకలు తెలిపారు. ఇక్కడ 2019లో జరిగిన వినాయక చవితి లడ్డూ వేలం పాటలో లడ్డూ ధర 27లక్షలు పలికింది. కానీ ఈ సారి ఏకంగా రూ.41 లక్షలు పలకడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

కాగా, ఈ ఏదాడి బాలాపూర్ లడ్డూ రికార్డు ధర పలికిన విషయం తెలిసిందే. రూ. 18.90 లక్షలకు మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్‌ ఈసారి వేలం పాటలో బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్నారు. చివరిసారి 2019లో  కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకోగా ఈ ఏడాది అంతకంటే ఎక్కవ ధర పలికింది. 

చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం వినాయకుడి చేతిలోని లడ్డూ చోరీ

మరిన్ని వార్తలు