వాట్సాప్ నోటిఫికేషన్ ట్రిక్స్

20 Dec, 2020 20:18 IST|Sakshi

వాట్సాప్ తన వినియోగదారుల సంఖ్యను కాలక్రమేణా భారీగా పెంచుకుంది. ఉచితంగా లభించడంతో పాటు సులభంగా వాడుకునే విదంగా ఉండటమే ఈ యాప్ చాలా ప్రజాదరణ పొందటానికి కారణం. గోప్యతా విషయంలో కూడా ఇతర యాప్ ల కంటే ఎక్కువ భద్రతా ఇందులో లభిస్తుంది. ప్రారంభంలో వాట్సాప్ వ్యక్తిగత కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడిన, నేడు ప్రొఫెషనల్ చాట్లు కూడా ఈ యాప్ ద్వారా పంపించ బడుతున్నాయి. ఇలా రోజు వృత్తిపరమైన, వ్యక్తిగత మెసేజ్ లతో మీ ఫోన్ లో ముఖ్యమైన చాట్‌ల విషయంలో కొంచెం ఇబ్బందికి గురి అవుతున్నాం. కొన్ని సార్లు మనం అవసరమైన వాటి కంటే అనవసరమైన మెసేజ్ వాటితో పదేపదే చూడటం వల్ల ఇబ్బందికి పడాల్సి వస్తుంది. ఇలా కాకుండా సాధారణ, ముఖ్యమైన మెసేజ్ లను వేరు చేయగలిగితే ఎలా ఉంటుంది. మేము చెప్పే ఈ చిన్న ట్రిక్స్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్‌ను మిస్ కాకూండా ఉంటారు.(చదవండి: వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఇవే!)

  • మీరు తక్కువ ప్రాముఖ్యత గల చాట్‌ల నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయడం ద్వారా మీరు ఈ అనవసరమైన మెసేజ్ లతో రోజంతా బాధపడరు.
  • మీరు ఒక వ్యక్తి లేదా గ్రూప్ చాట్ కోసం నోటిఫికేషన్ ట్యూన్ లేదా రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా సెట్ చేస్తే మీకు ఆ వ్యక్తి లేదా గ్రూప్ నుండి మెసేజ్ వచ్చినప్పుడు ఈ రింగ్‌టోన్ ద్వారా మీరు సులభంగా గుర్తించవచ్చు. దీని కోసం కస్టమ్ నోటిఫికేషన్ సెట్టింగ్ క్రింద ఉన్న ఆప్షన్ ద్వారా టోన్ ని సెట్ చేసుకోవచ్చు. 
  • మీరు ఎక్కువ సమయం చాట్ నోటిఫికేషన్‌లను సైలెంట్ మోడ్‌లో ఉంచాలనుకుంటే వైబ్రేషన్ కాలాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు గ్రూప్/పర్సనల్ కాంటాక్ట్ పేరుపై క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ కస్టమ్ నోటోఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. కస్టమ్ నోటోఫికేషన్ లో వైబ్రేషన్ మోడ్ ని ఎంచుకోవచ్చు.    
  • మీరు ఎవరి నుండి ఏదైనా సందేశాన్ని కోల్పోకూడదనుకుంటే చాట్ కోసం నోటిఫికేషన్ ప్రత్యేకంగా లైట్‌ ఆప్షన్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు కస్టమ్ సెట్టింగ్‌లకు వెళ్లి “లైట్” ఆప్షన్ కింద ఉన్న ఎంపికలను ఎంచుకోవచ్చు.
  • మీకు అవసరం లేని చాట్ యొక్క నోటిఫికేషన్లు కనిపించకూడదు అంటే మీకు నోటిఫికేషన్ అవసరం లేని చాట్ ని ఎంచుకొని నోటిఫికేషన్ సెట్టింగ్ బటన్ అఫ్ చేస్తే సరిపోతుంది. 
మరిన్ని వార్తలు