ఆధార్ కార్డుదారులకు తీపికబురు.. కొత్తగా మరో 166 కేంద్రాలు!

22 Nov, 2021 14:55 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుదారులకు తీపికబురు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) దేశవ్యాప్తంగా కొత్తగా మరో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా యూఐడీఏఐ విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశంలో ఉన్న 166 ఆధార్ సేవా కేంద్రాల్లో 55 మాత్రమే తెరిచి ఉన్నాయి. అంతేగాకుండా, బ్యాంకులు, తపాలా కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వాలు 52,000 ఆధార్ ఎన్ రోల్ మెంట్ కేంద్రాలను నడుపుతున్నాయి. 

యుఐడీఏఐ విడుదల చేసిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 122 ప్రదేశాలలో 166 ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఇప్పటికే దేశంలో ఉన్న ఆధార్ కేంద్రాలు వికలాంగులతో సహ 70 లక్షల మందికి సేవలందించాయి. మోడల్ ఏలోని ఆధార్ సేవా కేంద్రాలు రోజుకు 1,000 అభ్యర్థనలను మాత్రమే హ్యాండిల్ చేయగలవు. అదే సమయంలో, మోడల్-బి కేంద్రాలు-500, మోడల్-సీ కేంద్రాలు 250 అభ్యర్థనలను మాత్రమే స్వీకరిస్తాయి.

(చదవండి: Paytm ఢమాల్‌.. రెండు రోజుల్లో పదివేల కోట్ల లాస్‌!)

యుఐడీఏఐ ఇప్పటి వరకు 130.9 కోట్ల మందికి ఆధార్ నంబర్లను జారీ చేసింది.  బ్యాంకులు, పోస్టాఫీసులు, కామన్ సర్వీస్ సెంటర్లు, ఆఫీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, యూఐడీఏఐ ఆపరేటెడ్ ఆధార్ సర్వీస్ సెంటర్లలో మాత్రమే ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పేరు, చిరునామా, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాలను సరిచేయడం, ఫోటోను అప్ డేట్ చేయడం, పీవీసీ కార్డుకు అప్లై చేసుకోవడం వంటి ఇతర సేవలు ఇక్కడ లభిస్తాయి.

(చదవండి: రేయ్‌.. ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చార్రా?)

మరిన్ని వార్తలు