టెలికం ఉద్యోగాలు పెరిగాయి

20 Oct, 2022 00:25 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టెలికం, 5జీ విభాగంలో ఉద్యోగ ప్రకటనలు సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 33.7 శాతం పెరిగాయని గ్లోబల్‌ జాబ్‌ సైట్‌ ఇండీడ్‌ వెల్లడించింది. ‘5జీ సేవల కోసం భారత్‌ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 5జీ నిర్దిష్ట సాంకేతికత, సేవలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు ఇప్పటికే నియామకాలను ప్రారంభించాయి. తదుపరితరం నూతన టెలికం సాంకేతికతను వేగంగా స్వీకరించేందుకు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలో నియామకాల్లో పెరుగుదలను చూడవచ్చు.

కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలను రూపొందించగల, నెట్‌వర్క్‌ నిర్మాణాలను బలోపేతం చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరమని దీనినిబట్టి అవగతమవుతోంది. అభివృద్ధి చెందిన టెలికమ్యూనికేషన్‌ రంగానికి అనుగుణంగా ఉద్యోగార్ధులు, పరిశ్రమ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుల బలమైన సమూహాన్ని సృష్టించాలి’ అని నివేదిక వివరించింది. ఉద్యోగ ప్రకటనలు కస్టమర్‌ సర్వీస్‌ ప్రతినిధుల కోసం 13.91, ఆపరేషన్స్‌ అసోసియేట్స్‌ 8.22 శాతం అధికం అయ్యాయి. 2019 ఆగస్ట్‌ నుంచి 2022 ఆగస్ట్‌ మధ్య సైబర్‌ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం ప్రకటనలు 81 శాతం దూసుకెళ్లాయి. 

మరిన్ని వార్తలు