అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే

7 Aug, 2021 14:11 IST|Sakshi

5జీ..! హ్యూమన్‌ లైఫ్‌ స్టైల్‌ని  కంప్లీట్‌గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్‌ వర్క్‌ సంస్థలు 2021లో 19.91 బిలియన్‌ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్‌ దిగ్గజం గ్రాంటార్‌ డేటాను విడుదల చేసింది.

5జీ నెట్‌ వర్క్‌. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్‌ కనెక్టివిటీ, మొబైల్‌ నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థతో పాటు..వర్చవల్​ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్‌ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అందుకే ఆయా సం‍స్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్‌-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్‌ బ్రాండ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీకి ఆప్టిమైజ్‌ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్‌ వీడియోస్‌, ఆన్‌ లైన్‌ గేమ్స్‌, సోషల్‌ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్‌ రీసెర్చ్‌ సీనియర్‌ ప్రిన్సిపల్‌ రీసెర్చ్‌ మైఖెల్‌ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్‌లెస్‌ నెట్‌ వర్క్‌ ఇన్‌ఫ్రాస్టెక్చర్‌ మార‍్కెట్‌ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ (సీఎస్‌పీ)తో 5జీ నెట్‌ వర్క్‌తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో  2020 లో 5జీ నెట్‌ వర్క్‌ ఇన్‌ ఫ్రాస్ట్రెక‍్చర్‌ వినియోగం వల్ల వరల్డ్‌ వైడ్‌గా 13.7బిలియన‍్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్‌ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్‌ దిగ్గజం గ్రాంటార్‌ రిపోర్ట్‌లో పేర్కొంది. 


టైర్‌ 1 సిటీస్‌లో 60శాతం వినియోగం 
గ్రాంటర్‌ రిపోర్ట్‌ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్‌ వర్క్‌ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది.  ముఖ్యంగా టైర్‌ 1 సిటీస్‌ లో ప్రస్తుతం లాంగ్‌ టర్మ్‌ ఎవెల్యూషన్‌ (ఎల్‌టీఈ) కమ్యూనికేషన్‌ తో  వినియోగించే 4జీ నెట్‌ వర్క్‌ నుంచి 5జీ నెట్‌ వర్క్‌కు మార్చుకుంటారని  గ్రాంటార్‌ రీసెర్చ్‌ మైఖెల్‌ పొరౌస్కి తెలిపారు. 

మరిన్ని వార్తలు