India 5G Launch Date: అక్టోబరు ఒకటిన 5జీ సేవలు లాంచ్‌

24 Sep, 2022 15:34 IST|Sakshi

 న్యూఢిల్లీ:  వేగవంతమైన 5జీ సేవలకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ప్రభుత్వ జాతీయ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ శనివారం  గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ  అక్టోబరు 1న ప్రగతి మైదాన్‌లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో ఇండియా 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేసింది.రానున్న ఆసియాలో అతిపెద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్, ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో 5 జీ సేవలను లాంచ్‌ కానునున్నాయని ప్రకటించింది. 

(విప్రో ఉద్యోగులకు దసరా కానుక, 96 శాతం కవర్‌)

దేశీయ డిజిటల్ పరివర్తన, కనెక్టివిటీని కొత్త శిఖరాలకు తీసుకువెళుతూ ప్రధాని ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నారని వెల్లడించింది.  డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా  సంయుక్త ఆధరర్వ్యంలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ని నిర్వహిస్తారు. కాగా అతి త్వరలోనే దేశంలో 5జీ టెలికాం సేవలు 80శాతం  చేరువ కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు