సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

30 Aug, 2021 19:20 IST|Sakshi

మీకు ఈపీఎఫ్ ఖాతా ఉందా? అయితే, వెంటనే మీ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేయండి లేకపోతే వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబందనలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల సెప్టెంబర్ 1 నుంచి ఆధార్,  పాన్ లింకింగ్, ఎల్‌పీజీ ధరలు, జీఎస్‌టీ నిబంధనలు, గూగుల్ యాప్స్ పర్మిషన్ లకు మార్పులు చోటు చేసుకోనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. (చదవండి: అవును 'నేను ఏలియన్‌ని' : ఎలోన్ మస్క్)

కొత్త పీఎఫ్ రూల్
సెప్టెంబర్ 1 వరకు పీఎఫ్ ఖాతాతో ఆధార్ కార్డును లింక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేల మీరు లింకు చేయకపోతే మీకు అందించే ఈపీఎఫ్ ప్రయోజనాలు తగ్గించవచ్చు. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) ఆధార్ కార్డును పీఎఫ్ ఖాతాతో లింక్ చేయాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. మీ ఈపీఎఫ్ ఖాతాలో సంస్థ జమ చేసే నగదు జమ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఆధార్ - పాన్ లింకింగ్
మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే, వెంటనే లింక్ చేయండి. ఒకవేళ మీరు లింక్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేగాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. పాన్ ఆధార్ లింక్‌ గడువు సెప్టెంబర్ 30తో ముగుస్తుంది.  

ఎల్‌పీజీ సిలిండర్ ధర
ఎల్‌పీజీ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుంచి మారనున్నాయి. ముఖ్యంగా, గత రెండు-మూడు నెలలుగా ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి.

జీఎస్‌టీ కొత్త నిబంధన
జీఎస్‌టీఆర్-3బీ రిటర్న్స్ ఫైల్ చేయని ట్యాక్స్‌పేయర్స్ జీఎస్‌టీఆర్-1 రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఆంక్షలు విధించే సెంట్రల్ జీఎస్‌టీ రూల్స్‌లోని రూల్ 59(6) సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. వ్యాపారులు ఈ నెలకు సంబంధించిన జీఎస్‌టీఆర్-3బీ వచ్చే నెల 20 నుంచి 24 వరకు ఫైల్ చేయాలి. ఆ తర్వాతి నెలలో జీఎస్‌టీఆర్-1 ఫైల్ చేయాలి.

చెక్స్ క్లియరెన్స్ 
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) చెక్స్ క్లియరెన్స్ కోసం పాజిటీవ్ పే సిస్టమ్ అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సిస్టమ్ సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయనుంది యాక్సిస్ బ్యాంక్. భారీ మొత్తంలో చెక్స్ ఇచ్చేముందు కస్టమర్లు సంబంధిత బ్యాంకులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ మోసాలను అరికట్టడానికి పాజిటీవ్ పే సిస్టమ్ తీసుకొచ్చినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.

సెబీ కొత్త నిబంధన
 స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారికి పీక్ మార్జిన్ నార్మ్స్ అమలు చేస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నాలుగో దశ నియమ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.


 

మరిన్ని వార్తలు