మార్చి నెల ముగిసేలోపు ఈ పనులు వెంటనే చేసేయండి.. లేకపోతే మీకే నష్టం!

7 Mar, 2022 15:21 IST|Sakshi

ప్రతి ఏడాది కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి చాలా కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. అందులో భాగంగానే మార్చి చివరిలో, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలా పాత నిబంధనలు మారుతాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆర్థిక ప్రణాళిక కూడా తప్పనిసరి. ఏడాది పూర్తవుతున్నా కొన్ని పనులు పూర్తిచేయకపోతే మనం నష్టపోవాల్సి వస్తోంది. మార్చి 31లోపు పూర్తి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆదాయపు పన్ను రిటర్న్ 
ఎవై 2021-22 కోసం ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు తేదీని మార్చి 31, 2022 వరకు పొడిగించబడింది. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం.. ఐటీ రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేస్తే జరిమానా రూ.10,000 వరకు విధించే అవకాశం ఉంది. జరిమానా నుంచి తప్పించుకోవడానికి మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను చివరి తేదీకి ముందే ఫైల్ చేయండి.

పాన్ నెంబర్‌తో - ఆధార్ లింకు
ఆధార్ లింకింగ్ గడువు తేదీ మార్చి 31, 2022 వరకు ఉంది. ప్రభుత్వం సెప్టెంబర్ 30, 2021న గడువును పొడిగించిన తర్వాత మీ పాన్ నెంబర్‌ను- ఆధార్ నెంబర్‌తో చట్టాల ప్రకారం లింకు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గడువు తేదీలోగా రెండు డాక్యుమెంట్ లింక్ చేయడంలో విఫలమైనట్లయితే మీపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 272బి కింద మీరు రూ.10,000 జరిమానా విధించవచ్చు. 

కేవైసీ అప్‌డేట్
బ్యాంక్ ఖాతాలలో కేవైసీని పూర్తి చేయడానికి గడువు మార్చి 31 వరకు ఉంది. పాన్ చిరునామా రుజువు, బ్యాంక్ సూచించిన ఇతర సమాచారంతో సహా కేవైసీ అప్‌డేట్'లో భాగంగా సమర్పించాలి. 

పన్ను ఆదా
ఈ సంవత్సరానికి మీ ఆదాయాన్ని అంచనా వేయడానికి, సెక్షన్ 80C కింద పన్ను ఆదా కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టవలసి ఉంటుందో తెలుసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు ఇప్పటికే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మొదలైన పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టినట్లయితే, ఈ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు మార్చి 31లోపు కనీస సహకారం అందించాలి. కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయకపోతే ఖాతా క్లోజ్ చేసే అవకాశం ఉంది.

(చదవండి: హైదరాబాద్‌లో డేటాసెంటర్‌.. ప్రపంచంలోనే అతి పెద్దదిగా)

మరిన్ని వార్తలు