LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!

21 Feb, 2022 21:13 IST|Sakshi

LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు.

ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. 

తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. 

(చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్‌బీఐ..!)

మరిన్ని వార్తలు