5 ఆటోమొబైల్ కంపెనీల దెబ్బకి నిరుద్యోగులుగా 64,000 మంది

23 Sep, 2021 17:17 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలో పేర్కొన్నట్లుగా ఎక్కడో జరిగిన ఒక చర్య వల్ల ప్రస్తుతం జరుగుతున్న పని మీద ప్రభావం పడుతుంది. అలాగే, జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు వెంటనే కాకపోయిన ఆ తర్వాత ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో జరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత ఐదేళ్లలో భారతదేశం విడిచివెళ్లిపోతున్న సంఖ్య రోజు రోజుకి పెరిగి పోతుంది. దేశం విడిచిపోతున్న విదేశీ ఆటో మొబైల్ కంపెనీల వల్ల సుమారు 64,00 మంది ఉద్యోగం కోల్పోయినట్లు, రూ.2,485 కోట్ల నష్టం డీలర్లకు వాటిల్లినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్(ఎఫ్ఎడీఎ) భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖతో పంచుకున్న డేటాలో వెల్లడించింది. 

ఆరు ప్రధాన ఆటోమోటివ్ కంపెనీలు బ్రాండ్లు అయిన ఫోర్డ్, జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, ఫీయట్, హార్లే డేవిడ్సన్, యుఎం మోటార్ సైకిల్స్ వంటి అనేక దిగ్గజ విదేశీ వాహన కంపెనీలు 2017 నుంచి భారతదేశంలో అమ్మకాలను నిలిపివేశాయి. ఈ నిర్ణయం వల్ల 464 మందికి పైగా డీలర్లు ప్రభావితం అయ్యారు. ఎఫ్ఎడీఎ అధ్యక్షుడు వింకేష్ గులాటి మాట్లాడుతూ.. "ఈ ఎంఎన్​సీల ఆకస్మికంగా వెళ్ళిపోవడం మొత్తం ఆటో రిటైల్ పరిశ్రమకు చాలా బాధను కలిగిస్తాయి. వినియోగదారుల నుంచి సరైన మద్దతు లేకుండా వ్యాపారం చేయడం కష్టం. కానీ, దిగ్గజ కంపెనీలు తీసుకునే నిర్ణయం భారీ పెట్టుబడులతో ఈ రంగంలోనికి ప్రవేశించాలి అనుకునే స్టార్టప్ కంపెనీల ఉత్సాహాన్ని దెబ్బతీస్తుంది" అని ఆగస్టులో జరిగిన ఎఫ్ఎడీఎ మూడవ ఆటో రిటైల్ సమావేశానికి హాజరైన భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండేను ఉద్దేశించి ప్రస్తావించారు. 

ఫోర్డ్ ఇండియా
అనేక సంవత్సరాలుగా నిలుదొక్కుకునేందుకు ప్రయత్నించిన తర్వాత ఫోర్డ్ ఇండియా సెప్టెంబర్ 9, 2021న నిష్క్రమించింది. భారత్‌లో ఫోర్డ్‌ కంపెనీ కార్ల ప్లాంట్లను మూసివేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో స్వంత ఉద్యోగులలో 4,000 మందికి పైగా రెండు తయారీ ప్లాంట్లలో పనిచేస్తున్నారు. ఫోర్డ్ తీసుకున్న నిర్ణయం వల్ల వారు నిరుద్యోగులుగా మారనున్నారు. భారత్‌లో కార్యకలాపాలు నిలిపివేస్తున్న నేపథ్యంలో తమ పరిహారంపై స్పష్టతనివ్వాలని దేశీ ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ డిమాండ్‌ చేసింది. ఫోర్డ్‌ ఇండియా ఎండీ అనురాగ్‌ మెహ్రోత్రాకు ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ వింకేష్‌ గులాటీ ఈ మేరకు లేఖ రాశారు. (చదవండి: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ అందించిన మైక్రోసాఫ్ట్‌...!)

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు