70కి పైగా స్టార్టప్‌లలో వేలాది మంది తొలగింపు.. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం

29 Jan, 2023 17:20 IST|Sakshi

వరల్డ్‌ వైడ్‌గా లక్షలాది కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో దేశీయ స్టార్టప్‌ కంపెనీలు పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు 3-4 నెలలో వేలాది మంది వర్క్‌ ఫోర్స్‌కు పింక్‌ స్లిప్‌లు జారీ చేశారు. యూనికార్న్‌లతో సహా 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 21వేల మంది అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపినట్లు తెలుస్తోంది. 

ఓలా, ఎంపీల్‌, ఇన్నోవాకర్, అనాకాడెమీ, వేదాంతు, కార్స్24,ఓయో, మీషో, ఉడాన్ వంటి మరెన్నో కంపెనీలు ఉద్యోగుల్ని ఫైర్‌ చేశాయి. ఇప్పటి వరకు 16 ఎడ్యూటెక్‌  స్టార్టప్‌లు  8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి.

జనవరి ప్రారంభంతో  ఇప్పటికే దేశంలోని 16కి పైగా స్వదేశీ స్టార్టప్‌లు ఉద్యోగులను తొలగించాయి.

సోషల్ మీడియా సంస్థ షేర్‌ చాట్‌ (మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపు కంపెనీలో దాదాపు 500 మందిపై ప్రభావం చూపింది 

ఇక హెల్త్‌ యూనికార్న్‌ ఇన్నోవేకర్‌ దాదాపు 245 మంది ఉద్యోగులను తొలగించింది.

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ స్విగ్గీ  డెలివరీ వృద్ధి మందగించడంతో కంపెనీ 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది.

ఎండ్-టు-ఎండ్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన మెడీబడీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అన్నీ విభాగాలలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది అయితే రానున్న రోజుల్లో లేఆఫ్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు