ఆధార్‌తో 90 కోట్ల మొబైల్‌ నంబర్స్‌ అనుసంధానం

1 Apr, 2023 02:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆధార్‌తో ఒక కోటికిపైగా మొబైల్‌ నంబర్స్‌ అనుసంధానం అయ్యాయి. జనవరిలో ఈ సంఖ్య 56.7 లక్షలు నమోదైందని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ) వెల్లడించింది. ఆధార్‌తో పాన్‌ నంబర్‌ను అనుసంధానించడం ఈ పెరుగుదలకు కారణం అని వివరించింది.

ఇప్పటి వరకు 90 కోట్ల మంది ఆధార్‌తో తమ మొబైల్‌ నంబర్‌ను  అనుసంధానించినట్టు అంచనా. ఆధార్‌ను ప్రామాణికంగా చేసుకుని నమోదైన లావాదేవీలు జనవరిలో 199.62 కోట్లు, ఫిబ్రవరిలో 226.29 కోట్లకు చేరుకున్నాయి. 2023 ఫిబ్రవరి వరకు ఇటువంటి లావాదేవీలు 9,255 కోట్లు నమోదు కావడం గమనార్హం. ఈ–కేవైసీ లావాదేవీలు ఫిబ్రవరిలో 26.79 కోట్లు కాగా ఇప్పటి వరకు ఇవి మొత్తం 1,439 కోట్లుగా ఉన్నాయి.  

మరిన్ని వార్తలు