ఈ స్పూన్ ఖరీదు రూ. 2 లక్షలా..!

1 Aug, 2021 17:40 IST|Sakshi

కొందరిని అదృష్టం ఎలా తలుపు తడుతుంది అనేది చెప్పలేము?. తాజాగా అలాంటి ఒక సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. ఒక వ్యక్తి ఇటీవల లండన్ వీధుల్లో అమ్మకానికి ఉంచిన పాత నలిగిన సన్నని, పొడవైన హ్యాండిల్ స్పూన్ ను కేవలం 90 పైసలు పెట్టి కొన్నాడు. తర్వాత దానిని ఆన్ లైన్ వేలం వేయడం వల్ల అతనికి 2 లక్షల రూపాయలు వచ్చాయి. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే, ఇప్పుడు మనం దాని గురుంచి తెలుసుకుందాం. ఈ వ్యక్తి "ఐకియా తరహా స్టోర్ లో స్పూన్ ను 90 పైసలకు కొనుగోలు చేశాడు. అయితే, అది చూడాటానికి అరుదైన మధ్యయుగానికి చెందిన స్పూన్ లాగా ఉంది. 

ఈ పేరు తెలియని వ్యక్తి సోమర్సెట్ దేశంలోని క్రూకెర్నే నగరానికి చెందిన లారెన్స్ వేలం దారుల వద్దకు వచ్చి వేలం కోసం స్పూన్ ను ఆన్ లైన్ లో నమోదు చేశాడు. లారెన్స్ అనే కంపెనీ తమ పోర్టల్ ద్వారా పురాతన కాలానికి చెందిన వస్తువులను విక్రయానికి పెడుతుంది. ఇందులో వేలానికి ఉంచిన వస్తువులను ప్రముఖ నిపుణులు పరిశీలించి వాటిని వేలానికి పోర్టల్ ఉంచుతుంది. అలాగే, ఈ స్పూన్ ను లారెన్స్ వేలం పాటదారుల వెండి నిపుణుడు అలెక్స్ బుచర్ ఈ 5 అంగుళాల స్పూన్ ను పరిశీలించి ఇది 13వ శతాబ్దం చివరి నాటి వెండి స్పూన్ అని కనుగొని దానిని రూ.51,712 వద్ద వేలానికి ఉంచాడు. కొద్ది రోజుల తర్వాత దని దాని బిడ్ పెరుగుతూనే ఉంది. చివరకు బిడ్ ముగింపులో స్పూన్ ను రూ.1,97,000కు విక్రయించారు. పన్నులు, అదనపు ఛార్జీలతో కలిపి పురాతన స్పూన్ విలువ రూ.2 లక్షలు దాటింది.

మరిన్ని వార్తలు